తెలంగాణలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి.

Update: 2024-06-28 10:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణలో ఇప్పటికే ఇంటర్మీడియట్ కళాశాలలు ప్రారంభం కావడంతో పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను ఎస్ఎస్‌సీ బోర్డు అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు అధికారులు శుక్రవారం మద్యాహ్నం 3 గంటలకు ఫలితాలను ప్రకటించారు. మొత్తము 51,272 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 46,731 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 34,126 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అవ్వగా.. ఉత్తీర్ణతా శాతము 73.03 నమోదు అయ్యింది. ఇందులో బాలురు సాధించిన ఉత్తీర్ణతా శాతము 71.01 కాగా, బాలికల ఉత్తీర్ణతా శాతము 76.37 గా ఉంది.

ఈ పరంగా బాలికలు, బాలుర కంటే 5.36% అధికముగా ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మల్ జిల్లా అన్ని జిల్లాల కంటే 100 శాతము ఉత్తీర్ణత సాదించి ప్రథమ స్థానములో ఉండగా.. వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ ఉత్తీర్ణత శాతము అనగా 42.14 సాధించి చివరి స్థానములో ఉన్నది. ఇక విడుదలైన ఫలితాలను www.bsc.telangana.gov.in వెబ్ సైట్ లో చూసుకొవచ్చని వెల్లడించారు. విద్యార్ధులు ఫలితాలకు సంబందించిన కాపీని ప్రింట్ తీసుకొని భద్రంగా ఉంచుకోవాలని, అడ్మిషన్ల ప్రక్రియలో ఈ కాపీ కీలకంగా మారే అవకాశం ఉందని అధికారులు సూచించారు. కాగా తెలంగాణలో పదవ తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్ధులకు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13 వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించారు.


Similar News