పారామెడికల్‌ కోర్సుల్లో 10% EWS రిజర్వేషన్‌

పారా మెడికల్‌ కోర్సులకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్‌ వర్తింపజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2023-08-29 12:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పారా మెడికల్‌ కోర్సులకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్‌ వర్తింపజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీకి ఇవాళ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి 10 శాతం రిజర్వేషన్‌ వర్తించనుంది. బీపీటీ, ఎంపీటీ, ఎమ్మెస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్‌సీ నర్సింగ్‌ కోర్సులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపింది.


Similar News