టీ-కాంగ్రెస్‌కు ఎంపీ కోమటిరెడ్డి గుడ్‌న్యూస్

మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని అభ్యర్థి(పాల్వాయి స్రవంతి)ని ప్రకటించి ప్రచార వేగం పెంచింది.

Update: 2022-09-11 06:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని అభ్యర్థి(పాల్వాయి స్రవంతి)ని ప్రకటించి ప్రచార వేగం పెంచింది. అయితే, ఈ ఉప ఎన్నిక ప్రచారానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వస్తారా? రారా? అనే ప్రశ్న ఇప్పటివరకు కాంగ్రెస్‌ శ్రేణులను టెన్షన్ పెట్టింది. తాజాగా.. దీనిప క్లారిటీ ఇస్తూ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వస్తానని ప్రకటించారు. మునుగోడు ప్రచార బాధ్యతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అప్పగిస్తున్నట్లు నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించిన మరుసటిరోజే, తాను ప్రచారానికి వస్తానని కోమటిరెడ్డి హామీ ఇవ్వడం కాంగ్రెస్‌ శ్రేణులను ఆనందానికి గురిచేస్తోంది. కాగా, ఈ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ తరపున పోటీ చేస్తోన్న ప్రత్యర్థి, తమ్ముడు, రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం చేయనున్నారు.

Also Read : మునుగోడులో వాళ్లు నాకు హామీ ఇచ్చారు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


Also Read : అంతుచిక్కని బన్సల్ వ్యూహం.. మునుగోడుపై హైకమాండ్ నుంచి కీలక ఆదేశాలు 

Tags:    

Similar News