ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. తెలంగాణ అన్ లాక్ గైడ్‌లైన్స్ రిలీజ్..
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన ప్రభుత్వం.. తాజాగా అన్ లాక్ గైడ్ లైన్స్‌ను విడుదల చేసింది. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం లాంటి నిబంధనలు పాటించాలని సూచించింది. ఆఫీసులు, దుకాణాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, శానిటైజేషన్ తప్పనిసరి అని తెలిపింది.మాస్కు పెట్టుకోకపోతే వెయ్యి రూపాయాల జరిమానా కొనసాగుతుందని స్పష్టం చేసింది. జులై 1 నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభించనున్నట్లు గైడ్ లైన్స్‌లో […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన ప్రభుత్వం.. తాజాగా అన్ లాక్ గైడ్ లైన్స్‌ను విడుదల చేసింది. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం లాంటి నిబంధనలు పాటించాలని సూచించింది. ఆఫీసులు, దుకాణాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, శానిటైజేషన్ తప్పనిసరి అని తెలిపింది.మాస్కు పెట్టుకోకపోతే వెయ్యి రూపాయాల జరిమానా కొనసాగుతుందని స్పష్టం చేసింది. జులై 1 నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభించనున్నట్లు గైడ్ లైన్స్‌లో స్పష్టం చేసింది.
అటు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆమోదం తెలిపిన కేబినెట్.. టిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించింది. చెస్ట్ ఆస్పత్రి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, గడ్డి అన్నారం మార్కెట్ స్థలంలో మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, అల్వాల్- ఓఆర్ఆర్ మధ్యలో మరో సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. కొత్తపేట కూరగాయల మార్కెట్ ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌గా మార్చాలని నిర్ణయించింది.