సాగులో తెలంగాణ నెంబర్ వన్..

దిశ, వెబ్‌డెస్క్ : ఖరీఫ్ సాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గత వానాకాలంలో పోలిస్తే 36.59 శాతం పెరిగిందని సమాచారం. గతేడాది 1.02 కోట్ల ఎకరాలు సాగులో ఉండగా.. ఈ ఏడాది 1.35కోట్ల ఎకరాల్లో రైతులు పంట సాగు చేశారు. కాగా, తెలంగాణలో వరి సాగు ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మించిపోగా.. పత్తి లక్ష్యానికి దాదాపు చేరువలో నిలిచింది. అదేవిధంగా తెలంగాణలో యూరియా వాడకం పెరగగా.. పలుచోట్ల రైతులకు […]

Update: 2020-08-26 21:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఖరీఫ్ సాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గత వానాకాలంలో పోలిస్తే 36.59 శాతం పెరిగిందని సమాచారం. గతేడాది 1.02 కోట్ల ఎకరాలు సాగులో ఉండగా.. ఈ ఏడాది 1.35కోట్ల ఎకరాల్లో రైతులు పంట సాగు చేశారు.

కాగా, తెలంగాణలో వరి సాగు ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మించిపోగా.. పత్తి లక్ష్యానికి దాదాపు చేరువలో నిలిచింది. అదేవిధంగా తెలంగాణలో యూరియా వాడకం పెరగగా.. పలుచోట్ల రైతులకు తిప్పలు తప్పడం లేదని వ్యవసాయ గణాంకాలు వెల్లడించాయి.

Tags:    

Similar News