సాయుధ పోరాట యోధుడు కాంచనపల్లి మృతి
దిశ, నల్లగొండ: తెలంగాణ సాయుధ రైతాంగా పోరాట యోధుడు కాంచనపల్లి నారాయణ రావు మృతి చెందారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన బుధవారం రాత్రి కన్నుముశారు. వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన రాజకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముఖ్య భూమిక పోషించారు. నిజాం పాలన విముక్తి అనంతరం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల రోజున అంటే 1952లో ఆయన వివాహం చేసుకున్న రోజునే విధి నిర్వహణలో భాగంగా ఎన్నికల […]
దిశ, నల్లగొండ: తెలంగాణ సాయుధ రైతాంగా పోరాట యోధుడు కాంచనపల్లి నారాయణ రావు మృతి చెందారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన బుధవారం రాత్రి కన్నుముశారు. వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన రాజకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముఖ్య భూమిక పోషించారు. నిజాం పాలన విముక్తి అనంతరం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల రోజున అంటే 1952లో ఆయన వివాహం చేసుకున్న రోజునే విధి నిర్వహణలో భాగంగా ఎన్నికల విధులు నిర్వహించడం ఆయనకే చెల్లింది.