కరోనా కేసుల్లో తెలంగాణకు 12వ స్థానం

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో మన రాష్ట్రం 12వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 3,417 పాజిటివ్ కేసులు తేలగా.. ప్రస్తుతం 1,455 యాక్టివ్‌గా ఉన్నట్టు గురువారం వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తేలింది. లాక్‌డౌన్ 5.0కు ముందు పరిస్థితి అదుపులోనే ఉందనిపించినా..ఆ తర్వాత కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో రోజూ మూడంకెల్లో […]

Update: 2020-06-04 11:42 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో మన రాష్ట్రం 12వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 3,417 పాజిటివ్ కేసులు తేలగా.. ప్రస్తుతం 1,455 యాక్టివ్‌గా ఉన్నట్టు గురువారం వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తేలింది. లాక్‌డౌన్ 5.0కు ముందు పరిస్థితి అదుపులోనే ఉందనిపించినా..ఆ తర్వాత కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో రోజూ మూడంకెల్లో కొత్త కేసులు బయటపడుతుండగా..రాష్ట్రంలో నిత్యం 4-7కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా పేషంట్లకు చికిత్స అందించేందుకు గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కోవిడ్ ఆస్పత్రిగా మార్చివేశారు. ఆస్పత్రిలో 1,100 బెడ్లను ప్రత్యేకంగా కోవిడ్ చికిత్స కోసం ఏర్పాటు చేయగా..లాక్‌డౌన్ చివరి ప్రకటన వరకూ ఖాళీగా ఉండేవి. ప్రస్తుతం 1,455 మంది కరోనా చికిత్సలో ఉండటంతో బెడ్స్ సరిపోవడం లేదు. దీంతో అదనంగా 150 బెడ్స్‌ను గచ్చిబౌలి టిస్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు.మరో 150 బెడ్స్‌ను కూడా రెండు, మూడు రోజుల్లో గాంధీ ఆస్పత్రికి తీసుకురానున్నారు.

రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మెజారిటీ వాటా కలిగి ఉంది. వారం రోజుల నుంచి సగటున దాదాపు వందకు పైగా కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. గ్రేటర్‌ను రెడ్‌జోన్‌గా ప్రభుత్వం ప్రకటించినా..అధిక కేసులు నమోదవుతుండటంతో సిటీలో భయాందోళన పెరుగుతోంది. గ్రేటర్ పరిధిలో గురువారం 110 కేసులు నమోదవ్వగా..బుధవారం 108, మే 31న 122 కరోనా కేసులు వెలుగుచూశాయి. అత్యవసర సేవలతో పాటు దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తుండగా..మరో వైపు కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. పోలీస్, జీహెచ్ఎంసీ శాఖల పరిధిలో ఉద్యోగులతో పాటు సెకండరీ కాంటాక్ట్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తున్నందున నగరవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది.

కొత్తగా 127పాజిటివ్ కేసులు..ఆరుగురు మృతి

తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం గురువారం రాష్ట్రంలో 127మందికి పాజిటివ్ రాగా..ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 3,147కు చేరుకోగా..105 కరోనా మరణాలు సంభవించాయి. 1,587 మంది చికిత్స అనంతరం డిశ్చార్చి అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ 110, ఆదిలాబాద్ -7, రంగారెడ్డి -6, మేడ్చల్-2, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఒక్కోటి వచ్చాయి. వలస కూలీల్లోనూ, ఫారిన్ రిటర్న్‌ల్లో కొత్త కేసులు రాలేదని హెల్త్ బులిటెన్ వెల్లడించింది.

Tags:    

Similar News