బత్తుల భూమయ్యకు తెలంగాణ రత్న అవార్డు ప్రదానం

దిశ, వెల్గటూర్ : వెల్గటూరు మండల విద్యాధికారి బత్తుల భూమయ్య రాష్ట్ర స్థాయి తెలంగాణ రత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం విజయవాడలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో అక్కడి మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ చైతన్య రెడ్డి, విశ్రాంత కలెక్టర్ బి లక్ష్మీకాంతం, అర్పిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గణగళ్ల విజయ్ కుమార్‌ల చేతుల మీదుగా ఎంఈఓ భూమయ్య ఈ అవార్డును అందుకున్నారు. కాగా, విజయవాడకు చెందిన అర్పిత సాహిత్య, సాంస్కృతిక, స్వచ్ఛంద […]

Update: 2021-12-29 02:22 GMT

దిశ, వెల్గటూర్ : వెల్గటూరు మండల విద్యాధికారి బత్తుల భూమయ్య రాష్ట్ర స్థాయి తెలంగాణ రత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం విజయవాడలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో అక్కడి మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ చైతన్య రెడ్డి, విశ్రాంత కలెక్టర్ బి లక్ష్మీకాంతం, అర్పిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గణగళ్ల విజయ్ కుమార్‌ల చేతుల మీదుగా ఎంఈఓ భూమయ్య ఈ అవార్డును అందుకున్నారు.

కాగా, విజయవాడకు చెందిన అర్పిత సాహిత్య, సాంస్కృతిక, స్వచ్ఛంద సేవా సంస్థ 20వ వార్షికోత్సవం సందర్భంగా విద్య, వైద్యం, విధి నిర్వహణ, సామాజిక సేవ, కళలు, క్రీడలు, సాహిత్యం, సంగీతం, ఆధ్యాత్మిక రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. వెల్గటూర్ మండల విద్యాధికారి భూమయ్య కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ విద్యకు సంబంధించి విధినిర్వహణలో చూపించిన అంకితభావం, లయన్స్ క్లబ్ చొప్పదండి ద్వారా అందించిన సామాజిక సేవా కార్యక్రమాలు ఈ అవార్డు ఎంపికకు దోహదం చేశాయి.

కరోనా విపత్కర పరిస్థితుల సమయంలో లాక్ డౌన్ ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వెల్గటూర్, బుగ్గారం, ధర్మపురి మండలంలోని పాఠశాలలో పనిచేసే వందలాది మంది పార్ట్ టైం వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విద్య, విధి నిర్వహణ, సామాజిక సేవ రంగాల్లో అందించిన సేవలకు గాను ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు రావడం పట్ల తనపై మరింత సామాజిక బాధ్యత పెరిగిందని అవార్డు గ్రహీత భూమయ్య పేర్కొన్నారు. ఈ అవార్డు సాధించడానికి తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:    

Similar News