టాప్‌లో కర్ణాటక.. 4వ స్థానంలో తెలంగాణ
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సరికొత్త ఆవిష్కరణలు, వాటి అమలుకు కృషి చేస్తున్న రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2020లో దేశంలోని 17 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. 33.23 ఓవరాల్ స్కోర్‌తో గతేడాది స్థానాన్నే తెలంగాణ నిలబెట్టుకుంది. ఈ జాబితాలో కర్ణాటక మొదటి స్థానం పొందింది. హ్యూమన్ కేపిటల్, నాలెడ్జ్ అవుట్‌పుట్, నాలెడ్జ్ డిఫ్యూజన్ అనే బేసిన్‌పై నీతి […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సరికొత్త ఆవిష్కరణలు, వాటి అమలుకు కృషి చేస్తున్న రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2020లో దేశంలోని 17 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. 33.23 ఓవరాల్ స్కోర్‌తో గతేడాది స్థానాన్నే తెలంగాణ నిలబెట్టుకుంది. ఈ జాబితాలో కర్ణాటక మొదటి స్థానం పొందింది. హ్యూమన్ కేపిటల్, నాలెడ్జ్ అవుట్‌పుట్, నాలెడ్జ్ డిఫ్యూజన్ అనే బేసిన్‌పై నీతి అయోగ్ ఈ ర్యాంకులు వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి రాష్ట్రాలు అనుసరిస్తున్న వినూత్న విధానాల ఆధారంగా, మొత్తం ఏడు విభాగాల్లోని 36 అంశాల ఆధారంగా రాష్ట్రాల పనితీరును మదించి ర్యాంకులు ప్రకటించింది.