సైబర్ నేరాల్లో నాలుగో స్థానంలో తెలంగాణ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సైబర్‌క్రైం దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతినిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఏటేటా ఈ తరహా దాడుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. 2018లో దేశవ్యాప్తంగా జరిగిన నేరాల సంఖ్య 27,248గా నమోదయ్యాయి. 2019లో ఈ సంఖ్య 44,735కు పెరిగింది. 2020 నాటికి ఈ నేరాలు 50,035కు చేరుకున్నాయి. 2019తో పోలిస్తే 2020 నాటికి 11.8 శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) ఇచ్చిన నివేదికలో తేలింది. […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సైబర్‌క్రైం దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతినిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఏటేటా ఈ తరహా దాడుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. 2018లో దేశవ్యాప్తంగా జరిగిన నేరాల సంఖ్య 27,248గా నమోదయ్యాయి. 2019లో ఈ సంఖ్య 44,735కు పెరిగింది. 2020 నాటికి ఈ నేరాలు 50,035కు చేరుకున్నాయి. 2019తో పోలిస్తే 2020 నాటికి 11.8 శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) ఇచ్చిన నివేదికలో తేలింది. ఈ కేటగిరీ కింద నేరాల రేటు దేశవ్యాప్తంగా 3.3 నుంచి 3.7కి పెరిగింది. 2020లో నమోదైన 50,035 సైబర్ నేరాల కేసుల్లో 60.2(30,142 కేసులు) శాతం మోసానికి చెందినవే ఉన్నాయి. లైంగిక నేరాలకు సంబంధించి 3,293 కేసులతో 6.6 శాతం నమోదైంది. దోపిడీలకు సంబంధించి 2,440 కేసులతో 4.9 శాతం నమోదైంది.
తెలంగాణలో ఈ తరహా నేరాలు మరింత ఎక్కువయ్యాయి. 2018లో 1,205 ఘటనలు చోటుచేసుకున్నాయి. 2019లో సైబర్ దాడులు 2,691గా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా 2020లో ఏకంగా 5,024కు చేరుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన నివేదికలో తేలింది. ఈ నేరాల రేటు 13.4 శాతంగా నమోదైంది. చార్జీషీట్ చేసిన నేరాలు 42.5 శాతంగా తేలింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలో అత్యధికంగా సైబర్ నేరాలు జరుగుతున్న ప్రాంతాల్లో నాలుగో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలవగా.. 2020లో 11,097 కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో పేర్కొంది. 10,741 సైబర్‌దాడులతో రెండోస్థానంలో కర్ణాటక నిలిచింది. మహారాష్ట్రలో 5,496 నేరాలతో మూడో స్థానంలో ఉంది.
రాష్ట్రంలో కంప్యూటర్ఆ ధారిత మోసాల సంఖ్య 111గా ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన నివేదికలో తేలింది. ప్రైవసీకి భంగం కలిగించిన ఘటనలు 4 ఉండగా మహిళలను అసభ్యకర మెసేజులతో లైంగికంగా వేధించిన నేరాల సంఖ్య 97గా నమోదైంది. ఐటీ యాక్ట్కింద నమోదైన నేరాలు 306గా నివేదికలో తేలింది. మహిళలు, చిన్నారులకు సైబర్ బెదిరింపులు చేసిన నేరాలు 100 గా నమోదయ్యాయి. ఫ్రాడ్ కేసులకు సంబంధించిన నేరాలు 3,316, క్రెడిట్, డెబిట్కార్డులకు సంబంధించినవి 252 నేరాలుగా నమోదయ్యాయి. కంప్యూటర్ఆధారిత అఫెన్స్‌లు అత్యంత ఎక్కువగా జరుగుతున్నాయి.
మెట్రో పాలిటన్ సిటీల్లోనూ సైబర్ క్రైమ్ నేరాలు ప్రతి ఏటా విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. 2018లో 428 నేరాలు నమోదైతే, 2019లో 1,379, 2020లో 2,553 గా నమోదయ్యాయి. ప్రతిలక్ష మంది ప్రాతిపదికన తీసుకుంటే తెలంగాణలో జరుగుతున్న సైబర్ నేరాల రేటింగ్ 32.9 శాతంగా ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో తేలింది. అత్యధిక సైబర్ నేరాలు జరిగే మెట్రో పాలిటన్నగరాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. కాగా మొదటిస్థానంలో కర్ణాటక ఉంది.