ఆయనకు ప్రజలు రుణపడి ఉన్నారు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతాంగానికి ధరణి పోర్టల్ శ్రీ రామ రక్ష లాంటిదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం ప్రతీ నిర్ణయం వెనుక రైతు సంక్షేమం ఉంటుందని ఆయన తెలిపారు. సూర్యాపేట మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..రుణమాఫీ, రైతు బీమా సహా పలు పథకాలు రైతు ప్రయోజనం కోసం ప్రవేశ పెట్టినవే అని ఆయన అన్నారు. రాష్ట్ర […]

Update: 2020-10-31 04:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతాంగానికి ధరణి పోర్టల్ శ్రీ రామ రక్ష లాంటిదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం ప్రతీ నిర్ణయం వెనుక రైతు సంక్షేమం ఉంటుందని ఆయన తెలిపారు. సూర్యాపేట మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..రుణమాఫీ, రైతు బీమా సహా పలు పథకాలు రైతు ప్రయోజనం కోసం ప్రవేశ పెట్టినవే అని ఆయన అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో 65 శాతం పైగా కేటాయింపులను వ్యవసాయానికే కేటాయించామనీ..వాటిని రైతాంగం గుర్తించాలని ఆయన కోరారు. బడ్జెట్ లో ఇరిగేషన్ రంగానికి పెద్ద పీట వేస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరి భూమలకు వారినే హక్కుదారులుగా చేసేందుకే ప్రభుత్వం సొంత ఖర్చుతో భూ సర్వేను చేపట్టిందన్నారు. అందుకే ధరణి పోర్టల్ ఎంత ఖర్చు అయినప్పటికీ ప్రభుత్వం వెనకకు పోలేదన్నారు. ధరణి పోర్టల్ తీసుకు వచ్చి పట్టాల మార్పిడికి ఆస్కారం లేకుండా చేసిన సీఎం కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని ఆయన అన్నారు. అలాంటి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులు సంఘటితం కావాలని ఆయన తెలిపారు.

Tags:    

Similar News