ఐదు నంబర్లతో అలర్ట్.. సోషల్ మీడియాతోనూ సమస్య సాల్వ్!

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఏ ప్రాంతంలో సమస్య ఏర్పడిన క్షణాల్లో సమస్యను పరిష్కరించేందుకు ప్రతి డివిజన్‌లో అదనంగా 20 మంది సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. ఫిర్యాదులకు చేయడానికి 1912 మరియు 100 నెంబర్లను ఏర్పాటు చేసింది. ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి […]

Update: 2021-09-06 20:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఏ ప్రాంతంలో సమస్య ఏర్పడిన క్షణాల్లో సమస్యను పరిష్కరించేందుకు ప్రతి డివిజన్‌లో అదనంగా 20 మంది సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. ఫిర్యాదులకు చేయడానికి 1912 మరియు 100 నెంబర్లను ఏర్పాటు చేసింది. ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికితోడు విద్యుత్ సంస్థ మొబైల్ యాప్, ట్విట్టర్, ఫేస్ బుక్‌లో సమస్యను తెలిపినా తక్షణమే పరిష్కరించేలా విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది.

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లాలు, సర్కిళ్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా అన్ని చర్యలు చేపట్టింది. వర్షాల దృష్ట్యా డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు, విద్యుత్ అధికారులు, సిబ్బంది హెడ్ క్వార్టర్స్ లోనే ఉండేలా విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వర్షం కురుస్తున్న సమయాల్లో విద్యుత్ సామగ్రితో సిద్ధంగా ఉండాలని సీడీఎం ఆదేశించారు. ప్రతి సెక్షన్ ఆఫీసులో 30 పోల్స్‌తో పాటు ప్రతి డివిజన్‌లో అదనంగా 20 మంది తాత్కాలిక సిబ్బంది, కండక్టర్‌లు ఉండేలా చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరా తీరును పర్యవేక్షించేందుకు సబ్ స్టేషన్లు, ఫ్యూజ్ కాల్ ఆఫీస్ నుంచి పర్యవేక్షిస్తారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఎదురైనా క్షణాల్లో విద్యుత్ సిబ్బంది పునరుద్దరించనున్నారు.

అత్యవసరానికి ఐదు నంబర్లు

గ్రేటర్, జిల్లా, మండల కేంద్రాల్లో విద్యుత్ సమస్య ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. విద్యుత్ శాఖ అధికారులు జీహెచ్ఎంసీ, జిల్లాలోని అధికారులు, మున్సిపల్ సిబ్బందితో పాటు మండల్లాలో అధికారులతో సమన్వయం చేసుకోనున్నారు. విద్యుత్ ఫిర్యాదులకు 1912 మరియు 100 తో పాటు స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ కు ఫోన్ చేసే అవకాశం కల్పించారు. దీనికి తోడు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్2ను ఏర్పాటు చేసింది. 7382072104, 7382072106,7382071574 నెంబర్లను కేటాయించింది.

ప్రజలూ.. ఈ జాగ్రత్తలు పాటించండి..

ప్రజలు వర్షాల నేపథ్యంలో స్వీయ భద్రతా చర్యలు పాటించాలని విద్యుత్ అధికారులు కోరుతున్నారు. కిందకు వంగిన, కూలిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని, వాటిని తాకటం చేయరాదన్నారు. కింద పడినా, వేలాడుతున్న విద్యుత్ వైర్లను తాకడం, వాటిమీద నుంచి వాహనాలతో డ్రైవ్ చేయడం, వైర్లను తొక్కడం చేయొద్దని కోరారు. చెట్ల మీద, వాహనాల మీద విద్యుత్ వైర్లు పడితే వాటిని తాకే ప్రయత్నం చేయొద్దని, రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ వైర్లు గానీ, ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ఉన్నట్లయితే ఆ నీటిలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. విద్యుత్ స్తంభాలకు, స్టే వైర్లకు పశువులను కట్టేయవద్దని, వర్షం పడేటప్పుడు, తగ్గిన తరువాత పశువులను విద్యుత్ వైర్లకు, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా తీసుకెళ్లాలని కోరారు. వర్షం కురిసేటప్పుడు విద్యుత్ లైన్లు ఉన్న చెట్ల కింద నిలబడటం, చెట్లు ఎక్కడం చేయోద్దని, అపార్ట్మెంట్ సెల్లార్లలో ఉన్న మీటర్ ప్యానెల్ బోర్డులను మొదటి అంతస్తులోకి మార్చుకోవాలని సూచించారు.

Tags:    

Similar News