కేసీఆర్ పిరికివాడు.. కాషాయంతోనే తెలంగాణ ప్రజలు
దిశ, గద్వాల : తెలంగాణ ప్రజలు బీజేపీతోనే ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అందుకు నిదర్శనం దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలేనని చెప్పారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో బాగుపడింది ఇది కేవలం కల్వకుంట్ల కుటుంబమేనన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగులు, పెన్షనర్లు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ఉద్యోగాల్లేక యువత నష్టపోయిందన్నారు. కేసీఆర్ పిరికివాడని […]
దిశ, గద్వాల : తెలంగాణ ప్రజలు బీజేపీతోనే ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అందుకు నిదర్శనం దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలేనని చెప్పారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో బాగుపడింది ఇది కేవలం కల్వకుంట్ల కుటుంబమేనన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగులు, పెన్షనర్లు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ఉద్యోగాల్లేక యువత నష్టపోయిందన్నారు. కేసీఆర్ పిరికివాడని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది విద్యార్థులని, కేసీఆర్ కాదని విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగులను భయానికి గురిస్తోందని విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్ర రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ కేసీఆర్ నిరాహార దీక్ష ఉత్తదేన్నారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం తనేనని తెలిపారు. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ బీజేపీ జాతీయ భావాలు కలిగిన పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షుడు అప్సర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.