తెలంగాణలో కొత్త పాజిటివ్ కేసులు 66

దిశ, న్యూస్ బ్యూరో: కంటైన్‌మెంట్ క్లస్టర్ల విధానం కొత్త పేషెంట్లను గుర్తించడానికి వీలు కల్పించింది. ఇప్పటిదాకా గుట్టుచప్పుడు కాకుండా ఉండిపోయినవారంతా ఇప్పుడు బైటపడుతున్నారు. ఫలితంగా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళిపోతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 66 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. గురువారం యాభై మందికి పాజిటివ్ సోకినట్లు గుర్తించగా ఇప్పుడు మరో 66 మంది చేరారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరుకుంది. ఇప్పటిదాకా చికిత్స పొంది 186 మంది డిశ్చార్జి కావడం, 18 […]

Update: 2020-04-17 10:27 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కంటైన్‌మెంట్ క్లస్టర్ల విధానం కొత్త పేషెంట్లను గుర్తించడానికి వీలు కల్పించింది. ఇప్పటిదాకా గుట్టుచప్పుడు కాకుండా ఉండిపోయినవారంతా ఇప్పుడు బైటపడుతున్నారు. ఫలితంగా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళిపోతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 66 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. గురువారం యాభై మందికి పాజిటివ్ సోకినట్లు గుర్తించగా ఇప్పుడు మరో 66 మంది చేరారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరుకుంది. ఇప్పటిదాకా చికిత్స పొంది 186 మంది డిశ్చార్జి కావడం, 18 మంది చనిపోవడంతో యాక్టివ్ కరోనా పేషెంట్ల సంఖ్య 562 అయింది. ఇందులో సగానికంటే ఎక్కువ మంది (286) జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారు. కొత్తగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 66 మందిలో 46 మంది జీహెచ్ఎంసి పరిధిలోనే ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇక సూర్యాపేట జిల్లాల్లో ఒకే రోజున 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16వ తేదీనాటికి ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 23 ఉంటే, 24 గంటల వ్యవధిలో అది 44కు చేరుకుంది. నగరంలోని పాతబస్తీ ప్రాంతానికి చెందిన ఒక డాక్టరు కూడా పాజిటివ్ బారిన పడినట్లు సమాచారం. కరోనా ఉన్నట్లు గ్రహించక ఒక పేషెంట్‌కు చికిత్స చేసినందువల్లనే డాక్టర్‌కు పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు.

Tags : telangana, corona, positive cases, hyderabad, ghmc, Suryapet

Tags:    

Similar News