మంత్రి నిరంజన్ రెడ్డి మోత్కూర్ పర్యటనలో షాకింగ్ ఘటన (వీడియో)

దిశ, మోత్కూరు: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటనలో జేబు దొంగలు హల్‌చల్ చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి మంత్రి నిరంజన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ మంత్రిని స్వాగతించడానికి పూల బొకేలతో గుంపుగా ఆయన వాహనం వద్దకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తమ సత్తా చూపించారు. నేతలందరి వద్ద దాదాపు […]

Update: 2021-08-29 03:36 GMT

దిశ, మోత్కూరు: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటనలో జేబు దొంగలు హల్‌చల్ చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి మంత్రి నిరంజన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ మంత్రిని స్వాగతించడానికి పూల బొకేలతో గుంపుగా ఆయన వాహనం వద్దకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తమ సత్తా చూపించారు. నేతలందరి వద్ద దాదాపు నాలుగు లక్షలు కాజేశారు. జెడ్పీటీసీ భర్త గోరుపల్లి సంతోష్ రెడ్డి వద్దనున్న రూ. 40 వేలు, వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్ వద్ద రూ. 37 వేలు, రైతుబంధు అధ్యక్షులు కొండ్రేటి వేణుగోపాల్ రెడ్డి వద్ద రూ. 20 వేలు, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడి వద్ద రూ. 20 వేలు, తక్కెళ్లపాడు సర్పంచ్ వద్ద రూ.8 వేలు, ఎరువల కోసం వచ్చిన రైతు వద్ద రూ. 35 వేలు కాజేసి కలకలం సృష్టించిన మంత్రి పర్యటన అనంతరం జేబులు చూసుకున్న అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రి పర్యటనలో పోలీసుల నిర్లక్ష్యం మూలంగానే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News