ఫ్లాష్.. ఫ్లాష్.. చిక్కుల్లో మంత్రి ఎర్రబెల్లి.. మరోసారి షాక్

దిశ ప్ర‌తినిధి, వరంగ‌ల్: వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లా క‌మలాపూర్ ఎంపీడీవోపై మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి 15 రోజుల్లో నివేదిక అంద‌జేయాల‌ని జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ రేఖా శర్మ వ‌రంగ‌ల్ సీపీ త‌రుణ్‌జోషిని ఆదేశించారు. ఈ మేర‌కు నోటీసులు జారీ చేశారు. క‌మలాపూర్ ఎంపీడీవో సంఘ‌ట‌న‌పై కాంగ్రెస్ ఏఐసీసీ నాయ‌కుడు బ‌క్క జ‌డ్స‌న్ కొద్దిరోజుల క్రితం జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌కు […]

Update: 2021-08-10 07:27 GMT

దిశ ప్ర‌తినిధి, వరంగ‌ల్: వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లా క‌మలాపూర్ ఎంపీడీవోపై మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి 15 రోజుల్లో నివేదిక అంద‌జేయాల‌ని జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ రేఖా శర్మ వ‌రంగ‌ల్ సీపీ త‌రుణ్‌జోషిని ఆదేశించారు. ఈ మేర‌కు నోటీసులు జారీ చేశారు. క‌మలాపూర్ ఎంపీడీవో సంఘ‌ట‌న‌పై కాంగ్రెస్ ఏఐసీసీ నాయ‌కుడు బ‌క్క జ‌డ్స‌న్ కొద్దిరోజుల క్రితం జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు.

ఎంపీడీవోపై అస‌భ్య‌క‌ర‌రీతిలో అవ‌మానించేలా మంత్రి ఎర్ర‌బెల్లి వ్యాఖ్య‌లు చేశార‌ని, క‌లెక్ట‌ర్ రాజీవ్‌గాంధీ హ‌నుమంతు, ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి కూడా ఈ స‌మావేశంలో ఉన్నా.. ఏం మాట్లాడ‌లేద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ‌త నెల 27న ఫిర్యాదును విచార‌ణ‌కు స్వీక‌రిస్తున్న‌ట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్ ప‌ర్స‌న్‌ రేఖా శర్మ స్ప‌ష్టం చేశారు. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, క‌లెక్ట‌ర్ రాజీవ్‌గాంధీ హ‌నుమంతు, చ‌ల్లా ధ‌ర్మారెడ్డిల‌పై కేసు న‌మోదైంది. తాజాగా ఈ సంఘ‌ట‌న‌పై విచార‌ణ చేయాల‌ని వ‌రంగ‌ల్ సీపీ త‌రుణ్ జోషికి ఆదేశాలు అందాయి.

Tags:    

Similar News