బాలుడి ‘హరిత’ ఫిర్యాదు.. రూ.62 వేల ఫైన్

దిశ, ఫీచర్స్ : పర్యావరణ పరిరక్షణకు చెట్లు అతి ముఖ్యమైనవని అందరికీ తెలుసు. కానీ, చెట్ల పరిరక్షణకు కృషి చేసే వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. ఈ క్రమంలో చెట్ల పెంపకం కోసం ప్రభుత్వాలు కూడా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే మన రాష్ట్రంలో ‘తెలంగాణకు హరితహారం’ పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. తాజాగా సీఎం బర్త్‌డే పురస్కరించుకుని ‘కోటివృక్షార్చన’ పేరిట పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఆఫీసర్లు పూనుకున్నారు. […]

Update: 2021-02-09 06:04 GMT

దిశ, ఫీచర్స్ : పర్యావరణ పరిరక్షణకు చెట్లు అతి ముఖ్యమైనవని అందరికీ తెలుసు. కానీ, చెట్ల పరిరక్షణకు కృషి చేసే వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. ఈ క్రమంలో చెట్ల పెంపకం కోసం ప్రభుత్వాలు కూడా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే మన రాష్ట్రంలో ‘తెలంగాణకు హరితహారం’ పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. తాజాగా సీఎం బర్త్‌డే పురస్కరించుకుని ‘కోటివృక్షార్చన’ పేరిట పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఆఫీసర్లు పూనుకున్నారు. ఇది నాణేనికి ఒకవైపే కాగా, మరో వైపు చెట్ల నరికివేత కూడా యథేచ్చగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ పిల్లాడు.. 40 ఏళ్ల వయసున్న వృక్షాన్ని నరికివేయడాన్ని చూసి, అటవీశాఖకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని విచారించిన అధికారులు, అరుదైన వృక్షాన్ని నరికేసిన వ్యక్తికి రూ. 62,075/- జరిమానా విధించారు.

హైదరాబాద్‌ నగరంలోని సైదాబాద్‌కు చెందిన పిల్లాడికి చెట్లంటే చాలా ఇష్టం. స్కూల్‌లో ‘గ్రీన్ బ్రిగేడ్’ మెంబర్. సోమవారం ఉదయం 4 గంటల సమయంలో తన ఏరియాలో పెద్ద శబ్దం అవడంతో నిద్ర నుంచి లేచి పరిసరాలను గమనించాడు. అక్కడి 40 ఏళ్ల అరుదైన వృక్షాన్ని కొందరు నరికేసి తరలించడాన్ని చూసి, వెంటనే ఈ విషయాన్ని తెలంగాణ అటవీశాఖ ఆఫీసర్లకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సి.హెచ్.వెంకయ్య గౌడ్ ఆదేశాల మేరకు సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ మేరకు పర్మిషన్ లేకుండా చెట్టు నరికిన జి.సంతోష్ రెడ్డికి రూ.62,075 జరిమానా విధించారు. కాగా, సదరు విద్యార్థి.. అటవీశాఖ వారికి తన పేరు చెప్పకుండా, పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషిగా ఫిర్యాదు చేశానని తెలపడం విశేషం.

Tags:    

Similar News