తెలంగాణ సాహితీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా చంద్రమౌళి
దిశ, శాయంపేట: తెలంగాణ సాహితీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా కోగిల చంద్రమౌళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం హన్మకొండ జిల్లా కేంద్రంలో బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా ‘కవి సమ్మేళనం’ ఏర్పాటు చేసి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి నూతన కార్యవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా కోగిల చంద్రమౌళిని ఎన్నుకున్నారు. కో-కన్వీనర్‌లుగా డాక్టర్ మార్క శంకర్ నారాయణ, కార్తికరాజు, మందరపు వాణిశ్రీ, కాసుల రవికుమార్‌లను ఏకగ్రీవంగా […]
దిశ, శాయంపేట: తెలంగాణ సాహితీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా కోగిల చంద్రమౌళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం హన్మకొండ జిల్లా కేంద్రంలో బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా ‘కవి సమ్మేళనం’ ఏర్పాటు చేసి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి నూతన కార్యవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా కోగిల చంద్రమౌళిని ఎన్నుకున్నారు. కో-కన్వీనర్‌లుగా డాక్టర్ మార్క శంకర్ నారాయణ, కార్తికరాజు, మందరపు వాణిశ్రీ, కాసుల రవికుమార్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ.. తన నియామకానికి కృషి చేసిన సాహితీ మిత్రులు, కవులు, రచయితలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాహిత్య అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.