అమరుల త్యాగఫలమే తెలంగాణ: ఎస్పీ రంగనాథ్
దిశ, నల్లగొండ: ఎంతో మంది ఉద్యమకారుల పోరాటాలు, అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. తెలంగాణ అభివృద్ధిలో పోలీస్ శాఖ అన్ని స్థాయిలలో భాగస్వామ్యం అవుతూ శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, రాష్ట్రావతరణ సందర్భంగా అమరుల త్యాగాల స్పూర్తితో ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించాలని […]
దిశ, నల్లగొండ: ఎంతో మంది ఉద్యమకారుల పోరాటాలు, అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. తెలంగాణ అభివృద్ధిలో పోలీస్ శాఖ అన్ని స్థాయిలలో భాగస్వామ్యం అవుతూ శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, రాష్ట్రావతరణ సందర్భంగా అమరుల త్యాగాల స్పూర్తితో ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించాలని సిబ్బందికి ఆయన సూచించారు. అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని అదనపు ఎస్పీ నర్మద, ఆర్ముడు రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ లో ఏ.ఆర్. అదనపు ఎస్పీ పులిందర్ రెడ్డి, జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో డీటీసీ అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, డిఎస్పీ కార్యాలయంలో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ నిగిడాల సురేష్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సీఐ అనిల్, టూ టౌన్ సీఐ కార్యాలయంలో సీఐ మహబూబ్ బాషా, టూ టౌన్ లో ఎస్సై నర్సింహా, రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా అవతరణ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాధి నివారణ గురించి అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తప్పకుండా శానిటైజర్, మాస్కులు, గ్లౌజులు వాడాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. విధులు నిర్వహించడం ఎంత ముఖ్యమో, కరోనా వ్యాధి బారిన పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం అంతే ముఖ్యమని ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో ఎస్.బి. డీఎస్పీ రమణా రెడ్డి, సిఐ రవీందర్, సత్యం, బాలగోపాల్, పి.ఎన్.డి. ప్రసాద్, రాజశేఖర్ గౌడ్, అనిల్, ఆర్.ఐ.లు వై.వి.ప్రతాప్, నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, భరత్ భూషణ్, నర్సింహా, ఏ.ఓ. మంజు భార్గవి, సూపరింటెండెంట్లు అతిఖుర్ రెహమాన్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.