అన్యోన్యతను పెంచిన వ‌ర్క్ ఫ్రం హోం

దిశ, న్యూస్‌బ్యూరో: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దంపతుల మధ్య ప్రేమ, అన్యోన్యత పెరిగింది. అవును నిజం.. ఎప్పుడూ ఎక్కువ సమయం కలిసి గడపలేని దంపతులకు లాక్‌డౌన్, వర్క్ ఫ్రం హోం మేలు కలిగించాయి. దీంతో ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు పరిష్కారమయ్యాయి. క‌రోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మెజార్టీ సాఫ్ట్‌వేర్ కంపెనీలు అందుబాటులోకి తెచ్చిన‌ `వ‌ర్క్ ఫ్రం హోం` విధానం అమ‌లుపై టెక్కీలు త‌మ అభిప్రాయాన్ని ఆస‌క్తిక‌రంగా పంచుకున్నారు. `వ‌ర్క్ ఫ్రం హోం` వ‌ల్ల‌ భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య‌ బంధం […]

Update: 2020-06-15 06:29 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దంపతుల మధ్య ప్రేమ, అన్యోన్యత పెరిగింది. అవును నిజం.. ఎప్పుడూ ఎక్కువ సమయం కలిసి గడపలేని దంపతులకు లాక్‌డౌన్, వర్క్ ఫ్రం హోం మేలు కలిగించాయి. దీంతో ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు పరిష్కారమయ్యాయి. క‌రోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మెజార్టీ సాఫ్ట్‌వేర్ కంపెనీలు అందుబాటులోకి తెచ్చిన‌ 'వ‌ర్క్ ఫ్రం హోం' విధానం అమ‌లుపై టెక్కీలు త‌మ అభిప్రాయాన్ని ఆస‌క్తిక‌రంగా పంచుకున్నారు. 'వ‌ర్క్ ఫ్రం హోం' వ‌ల్ల‌ భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య‌ బంధం పెరుగుతున్నట్లు తెలిపారు. గ‌తంలో విదేశాలంటే మోజు చూపించే టెకీలు ఇప్పుడు దేశంలోనే ఉద్యోగం చేసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్లు స్పష్టం చేశారు.

దాదాపు నెలరోజులుగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) నిర్వ‌హిస్తోన్న స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. వ‌ర్క్ ఫ్రం హోం పెద్ద ఎత్తున సాగుతున్న నేప‌థ్యంలో 500 శాంపిళ్ల యొక్క 150 ప్రాజెక్టులను టీటా ప్రతినిధులు అధ్య‌య‌నం చేశారు. కొంద‌రిని వ్య‌క్తిగ‌తంగా, మ‌రి కొంద‌రిని ఆన్‌లైన్‌లో, ఇంకొంద‌రిని స‌మాచారం పంచుకోవ‌డం రూపంలో సంప్ర‌దించి వివ‌రాలు సేక‌రించారు. వ‌ర్క్ ఫ్రం హోం సాగుతున్న తీరు, దీన్ని కొన‌సాగిస్తే ఎలా అనే దానిపై అధ్య‌య‌నం జ‌రిగింది. నిమ్‌ హ‌న్స్ రిపోర్ట్ ప్ర‌కారం అధికంగా విడాకులు ఉండే రంగం ఐటీ ప‌రిశ్ర‌మ కాగా, వ‌ర్క్ ఫ్రం హోం అమ‌లు స‌మ‌యంలో భాగస్వామితో అనుబంధం ఎలా ఉందనే ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం వ‌చ్చింది. ఈ స‌ర్వే గురించి టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మ‌క్తాల సోమవారం మాట్లాడుతూ.. గ‌త నెల రోజులుగా స‌ర్వే సాగుతోంద‌ని, వ్య‌క్తిగ‌తంగా, స‌ర్వే ఫారాల ద్వారా అభిప్రాయాలు తీసుకుంటున్నామ‌న్నారు. వ‌ర్క్ ఫ్రం హోం విష‌యంలో టెకీలు త‌మ అభిప్రాలు పంచుకుంటూ మ‌రిన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తే వ‌ర్క్ ఫ్రం చేసేందుకు త‌మ‌కు ఇబ్బందులు లేవని చెప్పినట్లు పేర్కొన్నారు. గ‌తంలో విదేశాల్లోని ప్రాజెక్టులపై అత్యంత ఆస‌క్తి చూపే సాఫ్ట్‌వేర్‌లు ఇప్పుడు మునుప‌టిలా ఆస‌క్తి చూపట్లేదని వెల్లడించారు.

సర్వే ఫలితాలు…

– వ‌ర్క్ ఫ్రం హోం కొన‌సాగిస్తే ఇష్టపడేవారు- 82.29%
– వ‌ర్క్ ఫ్రం హోం కోసం మీ ఇంట్లో ప్ర‌త్యేక వ‌ర్క్ స్పేస్ ఉందా? అవును- 62.5%
– ఎక్క‌డి నుంచి వ‌ర్క్ ఫ్రం హోం చేశారు?
బెడ్ రూం- 44.79%, మెయిన్ హాల్‌- 22.91%, ల్యాన్‌- 1.04%, ఆఫీస్ స్పేస్‌- 23.96%, బాల్కనీ- 3.12, ఫ్లోర్- 4.17%
– వ‌ర్క్ ఫ్రం హోం ఏ ప్రాంతం నుంచి చేశారు ?
మెట్రో- 41.66%, అర్బ‌న్‌- 31.25%, రూర‌ల్‌- 21.87%, సెమీ అర్బ‌న్‌- 5.2 శాతం
– వ‌ర్క్ ఫ్రం హోం కోసం ఇన్సెంటివ్ ప్ర‌క‌టించిన కంపెనీలు ఎన్ని ఉన్నాయి? కేవలం 8.33% మాత్రమే
– ఎన్ని గంట‌లు వ‌ర్క్ ఫ్రం హోంలో ప‌ని చేశారు?
8 గంటల కంటే తక్కువ- 2.08%
12 గంటల వరకు – 8.33%
10- 12 గంటలు – 28.12%
8- 10 గంటలు -48.95%
8 గంటలు -12.5%
– వ‌ర్క్ ఫ్రం హోంలో భాగస్వామితో అనుబంధం ఎలా ఉంది?
బాగుంది- 88.54%
– లాక్ డౌన్ సమయంలో ఇంటి నుంచి పని చేయడంలో మీరు ఒత్తిడికి లోనయ్యారా?
అవును – 37.5%, కాదు- 62.5 శాతం
– వెంట‌నే ఆన్ సైట్ (ఇత‌ర దేశాల్లో ప‌ని అవ‌కాశం) క‌ల్పిస్తే ఎంత‌మంది ఆస‌క్తితో ఉన్నారు. 42.70%

Tags:    

Similar News