సింగరేణి నర్సు పోస్టులకు పురుషులూ అర్హులే -హైకోర్టు
దిశ, తెలంగాణ బ్యూరో: వివిధ స్థాయిల్లోని నర్సు పోస్టులు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదని, అర్హులైన పురుషులు ఉంటే వారిని కూడా నియమించవచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. pho కాలరీస్ గత నెల 22న జారీ చేసిన ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (నెం.01/2021; తేదీ 22-1-2021)లో ‘జూనియర్ స్టాఫ్ నర్స్ – ఫిమేల్ ఓన్లీ’ అంటూ పేర్కొంది. దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో ఇటీవల రిట్ పిటిషన్ దాఖలైంది. దీన్ని శుక్రవారం విచారించిన హైకోర్టు బెంచ్ పురుషులు […]
దిశ, తెలంగాణ బ్యూరో: వివిధ స్థాయిల్లోని నర్సు పోస్టులు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదని, అర్హులైన పురుషులు ఉంటే వారిని కూడా నియమించవచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. pho కాలరీస్ గత నెల 22న జారీ చేసిన ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (నెం.01/2021; తేదీ 22-1-2021)లో ‘జూనియర్ స్టాఫ్ నర్స్ – ఫిమేల్ ఓన్లీ’ అంటూ పేర్కొంది. దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో ఇటీవల రిట్ పిటిషన్ దాఖలైంది. దీన్ని శుక్రవారం విచారించిన హైకోర్టు బెంచ్ పురుషులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
నర్సు పోస్టుల్లో కేవలం మహిళలను మాత్రమే నియమించాలని, పురుషులను నియమించవద్దని ఏ చట్టంగానీ, సర్వీస్ రూల్సుగానీ పేర్కొనలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకపోయినా పురుషులను నర్సు పోస్టులకు దరఖాస్తు చేసుకోనివ్వకుండా నిరోధించడం చట్ట ప్రకారం సమ్మతం కాదని ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు. అర్హత ఉన్నట్లయితే ‘మేల్ నర్సు’లుగా పురుషులు కూడా దరఖాస్తు చేసుకునే విధంగా నోటిఫికేషన్‌ను సవరించాలని కోరారు. పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది జ్యోతిశ్రీ వాదిస్తూ, ఏకపక్షంగా రిజర్వేషన్లు, కారణమేమీ లేకుండా నిషేధాలు, షరతులు విధించడం ఏ ఉద్యోగానికీ సబబు కాదని వాదించారు. స్త్రీ, పురుష లింగ వివక్షకు కాలం చెల్లిందన్నారు.
సింగరేణి కాలరీస్ తరపు న్యాయవాది వాదిస్తూ మగ నర్సుల నియామకానికి ఎలాంటి అవరోధం లేదని, స్పష్టమైన సర్వీస్ రూల్స్‌గానీ, విధాన నిర్ణయంగానీ లేదని పేర్కొన్నారు. కానీ సింగరేణి సంస్థలో చాలా కాలంగా అమలవుతున్న ఒక సంప్రదాయం మాత్రమేనని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు బెంచ్, నర్సు పోస్టులకు పురుషులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, దీనికి అనుగుణంగా సింగరేణి సంస్థ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్‌ను సవరించాలని, దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా తేదీని కూడా పొడిగించాలని ఆ సంస్థ న్యాయవాదికి స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టులో ‘ఆర్మీ ఆర్డినెన్సు-1943’లోని మగ నర్సుల నియామకపు నిషేధంపై 2018లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన తరుణంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడం ప్రాముఖ్యం సంతరించుకుంది.