RRB Technician Preliminary key: ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ రాత పరీక్ష ప్రిలిమినరీ 'కీ' విడుదల..!
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్(Technician) పోస్టుల నియామకం కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) ఈ ఏడాది మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్(Technician) పోస్టుల నియామకం కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) ఈ ఏడాది మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 14,298 గ్రేడ్-1(Grade-1) టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టులకు సంబంధించి నియామక పరీక్షలను డిసెంబర్ 19, 20వ తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో నిర్వహించారు. ఇదిలా ఉంటే.. టెక్నీషియన్ రాత పరీక్ష ప్రిలిమినరీ కీ(Preliminary key) ని రైల్వే శాఖ తాజాగా విడుదల చేసింది. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/ లో తమ రిజిస్ట్రేషన్ నంబర్(Registration No), డేట్ ఆఫ్ బర్త్(DOB) డీటైల్స్ ఎంటర్ చేసి కీతో పాటు రెస్పాన్స్ షీట్(Response Sheet) డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు కీపై ఏమైనా అభ్యంతరాలు(Objections) ఉంటే డిసెంబర్ 31 వరకు తెలియజేయవచ్చు.