ఐదు శాతం తగ్గిన తెలంగాణ జీఎస్టీ వసూళ్ళు

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్ళలో పురోగతి కనిపించినా.. తెలంగాణలో మాత్రం గతేడాది నవంబరుతో పోలిస్తే తగ్గింది. ఈ సంవత్సరం నవంబర్ మాసానికి అన్ని రాష్ట్రాల్లో కలిపి జీఎస్టీ వసూళ్ళు రూ. 1.04 లక్షల కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. గత నెల వసూళ్ళతో పోలిస్తే కాస్త తగ్గినా గతేడాది నవంబరు మాసంతో పోలిస్తే మాత్రం 1.4% మేర పెరిగినట్లు పేర్కొంది. రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, గుజరాత్, తమిళనాడు, […]

Update: 2020-12-01 12:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్ళలో పురోగతి కనిపించినా.. తెలంగాణలో మాత్రం గతేడాది నవంబరుతో పోలిస్తే తగ్గింది. ఈ సంవత్సరం నవంబర్ మాసానికి అన్ని రాష్ట్రాల్లో కలిపి జీఎస్టీ వసూళ్ళు రూ. 1.04 లక్షల కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. గత నెల వసూళ్ళతో పోలిస్తే కాస్త తగ్గినా గతేడాది నవంబరు మాసంతో పోలిస్తే మాత్రం 1.4% మేర పెరిగినట్లు పేర్కొంది. రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత సంవత్సరం నవంబరుతో పోలిస్తే జీఎస్టీ వసూళ్ళు పెరిగినా తెలంగాణలో మాత్రం ఐదు శాతం మేర తగ్గింది.

గతేడాది నవంబరులో తెలంగాణ జీఎస్టీ వసూళ్ళు రూ. 3,349 కోట్లు ఉంటే ఈసారి నవంబరులో మాత్రం అది రూ. 3,175 కోట్లు అని పేర్కొంది. దక్షిణాదిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మినహా కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్ళు గతేడాది నవంబరుతో పోలిస్తే తగ్గాయి. ఇతర దేశాల నుంచి దిగుమతులు పెరగడం ద్వారా రెవెన్యూ పెరిగిందని పేర్కొంది.

Tags:    

Similar News