మరోసారి భూముల అమ్మకానికి సిద్దమైన కేసీఆర్.. ఎక్కడెక్కడంటే ?

దిశ, సిటీ బ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ర్ట ప్రభుత్వం మరోసారి సర్కారు భూములను అమ్మేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఖానామెట్, కోకాపేటలో హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కు చెందిన భూములను విక్రయించి, రూ. 2 వేల కోట్ల నిధులను సమకూర్చుకున్న ప్రభుత్వం ఈ సారి తెలంగాణ స్టేట్ ఇండస్టీస్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) కు చెందిన ఖానామెట్, పుప్పాల్ గూడల్లోని భూములను విక్రయించేందుకు సిద్దమైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 30వ తేదీన నోటిఫికేషన్ […]

Update: 2021-08-28 18:46 GMT

దిశ, సిటీ బ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ర్ట ప్రభుత్వం మరోసారి సర్కారు భూములను అమ్మేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఖానామెట్, కోకాపేటలో హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కు చెందిన భూములను విక్రయించి, రూ. 2 వేల కోట్ల నిధులను సమకూర్చుకున్న ప్రభుత్వం ఈ సారి తెలంగాణ స్టేట్ ఇండస్టీస్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) కు చెందిన ఖానామెట్, పుప్పాల్ గూడల్లోని భూములను విక్రయించేందుకు సిద్దమైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 30వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. వచ్చే నెల 9వ తేదీన ఫ్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించి, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థలు, ఏజెన్సీల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను 25 వరకు చేపట్టి, అదే రోజు సాయంత్రం ఐదు గంటల్లోపు ఈఎండీ చెల్లించిన సంస్థలతో వచ్చే నెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు ఆక్షన్ నిర్వహించేందుకు సిద్దమైంది.

ఖానామెట్ లో 27.79 ఎకరాల్లోని తొమ్మిది ప్లాట్లు, పుప్పాల్ గూడలోని 94.56 ఎకరాల్లోని 26 ప్లాట్ల ను విక్రయించనుంది. ఖానామెట్ లో కనిష్టంగా 70 గుంటలు మొదలుకుని ఒక ఎకరం 74 గుంటలు, గరిష్టంగా 3 ఎకరాల 9 గుంటలు, 3 ఎకరాల 10 గుంటలు మొదలుకుని 3 ఎకరాల 78 గుంటల విస్తీర్ణంతో మొత్తం 7 ప్లాట్లున్నాయి. వీటిలో ప్లాట్ నెంబర్ 7 నుంచి పది వరకు 27న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు ఆన్ లైన్ ఆక్షన్ నిర్వహించనున్నట్లు , ఆ తర్వాత ప్లాట్ నెంబర్ 11 నుంచి ఫ్లాట్లకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆక్షన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే పుప్పాల్ గూడలో విక్రయించనున్న మొత్తం 94.56 ఎకరాల్లో కనిష్టంగా రెండు ఎకరాల 24 గుంటలు మొదలుకుని 3 ఎకరాలు, 3 ఎకరాల 24 గుంటలు, అలాగే నాలుగు, ఐదు ఎకరాలతో పాటు గరిష్టంగా ఆరు ఎకరాలు, ఆరు ఎకరాల 64 గుంటల ఏరియా కల్గిన మొత్తం 26 ప్లాట్లున్నాయి. పుప్పాల్ గూడలోని ఈ ఫ్లాట్లలో ఫ్లాట్ నెంబర్ 12 నుంచి 26 వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు ఆక్షన్ నిర్వహించి, ప్లాట్ నెంబర్ 1 నుంచి 11 వరకున్న ఫ్లాట్లకు మధ్యాహ్నాం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆ వేలాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూముల విక్రయం ద్వారా సర్కారు సుమారు రూ. 4వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది.

ఈ ఏటా వెయ్యి ఎకరాలు అమ్మే లక్ష్యం
ఈ సంవత్సరం చివరి నాటి కల్లా ప్రభుత్వం మొత్తం వెయ్యి ఎకరాల సర్కారు భూములను విక్రయించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. తొలి దశగా హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీకి చెందిన స్థలాలను విక్రయించి రూ. 2వేల ఆదాయాన్ని సమకూర్చుకోగా, రెండో దఫాగా ఖానా మెట్, పుప్పాల్ గూడల్లో కలిపి సుమారు 119 ఎకరాల సర్కారు భూమిని అమ్మేందుకు సిద్దమైంది. వీటి అమ్మకం తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు మాసాలు ముగిసే లోపే వెయ్యి ఎకరాల భూముల అమ్మకాన్ని టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. వీటి అమ్మకానికి ఏర్పాట్లు చేస్తూనే నగర శివారు, ఇరుగు, పొరుగు జిల్లాల్లోని హౌజింగ్ బోర్డు, ఆర్టీసీకి చెందిన ఎకరాల భూములను విక్రయం కోసం గుర్తించే పనిలో సర్కారు ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News