ధరణి డ్యాష్‌బోర్డు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ మాడ్యూల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. డ్యాష్‌బోర్డు నిల్‌గా ఉండాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. రిజిస్ట్రేషన్ నిషేదిత భూముల జాబితా సవరణ కోసం వచ్చిన దరఖాస్తులపై శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ సమీక్షించారు. ఐతే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచొద్దని ఆదేశించారు. పీఓబీ కేసుల పరిష్కారంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఈ అంశంలో బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు. మిగతా జిల్లాల్లోనూ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ పై వచ్చిన దరఖాస్తులను […]
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ మాడ్యూల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. డ్యాష్‌బోర్డు నిల్‌గా ఉండాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. రిజిస్ట్రేషన్ నిషేదిత భూముల జాబితా సవరణ కోసం వచ్చిన దరఖాస్తులపై శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ సమీక్షించారు. ఐతే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచొద్దని ఆదేశించారు. పీఓబీ కేసుల పరిష్కారంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఈ అంశంలో బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు. మిగతా జిల్లాల్లోనూ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ పై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలన్నట్లు తెలిసింది. కలెక్టర్లకే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అన్‌లాక్ ఆప్షన్ ఇచ్చినందున వెంట వెంటనే డిస్పోజ్ చేయాలన్నారు.
త్వరితగతిన పరిష్కరించే ఈ ఫ్రెండ్లీ యూజర్ ను వినియోగించుకోవాలని, మరో రెండు రోజుల్లో పెండింగ్ లేకుండా అన్నింటినీ క్లియర్ చేయాలని కలెక్టర్లకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి సూచించారు. అత్యంత ప్రాధాన్యత ఈ దరఖాస్తులకే ఇవ్వాలన్నారు. దరఖాస్తుదారుడికి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా? అని అడగడం లేదు. గంపగుత్తగా తిరస్కరిస్తూ డ్యాష్ బోర్డును క్లియర్ చేయించే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నమైనట్లు స్పష్టమవుతోంది. ఖాస్రా పహాణీలో నేచర్ ఆఫ్ల్యాండ్ఏది ఉంటే అదే ఫైనల్‌గా కలెక్టర్ల ఆదేశాల మేరకు తహశీల్దార్లు రిపోర్టులు పంపిస్తున్నారు. ఇక మీ చావు మీరు చావండంటూ దరఖాస్తులను రిజెక్ట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆఖరికి భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, కొత్త పట్టాదారు పాసు పుస్తకాల జారీ చేసిన పట్టా భూములను కూడా ప్రభుత్వానివంటూ ఏకపక్షంగా తిరస్కరిస్తున్నారు. సమస్యను పరిష్కరించే కంటే తిరస్కరిస్తూ డ్యాష్ బోర్డులో పెండింగ్నిల్చూపించుకోవడానికి అధికారులు ఆసక్తి చూపిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో ఎన్నింటిని ఆమోదించారు? ఎన్నింటిని తిరస్కరించారు? అన్న లెక్కలు తీస్తే కలెక్టర్ల క్లియరెన్స్ విధానంపై క్లారిటీ రానుంది.