కొత్త ఫార్మాట్ కోసం బులెటిన్‌నే ఆపిన తెలంగాణ
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా గణాంకాలను పేర్కొనే బులెటిన్ తప్పుల తడకగా ఉంటుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఫార్మాట్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కారణంగా శనివారం విడుదల చేసే బులెటిన్‌ను ఇవ్వబోమంటూ మీడియాకు సమాచారం పంపారు అధికారులు. ఆదివారం ఉదయం ఇస్తామని పేర్కొన్నారు. ఫార్మాట్ మార్పు కోసం ఏకంగా బులెటిన్‌ను విడుదల చేయడాన్నే నిలిపివేశారు. ఐటీ రంగంలో విప్లవాలే సృష్టిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఫార్మాట్ మార్చడానికి బులెటిన్‌నే ఆపేయాల్సిన అవసరం ఏర్పడిందా అనే చర్చలు […]
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా గణాంకాలను పేర్కొనే బులెటిన్ తప్పుల తడకగా ఉంటుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఫార్మాట్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కారణంగా శనివారం విడుదల చేసే బులెటిన్‌ను ఇవ్వబోమంటూ మీడియాకు సమాచారం పంపారు అధికారులు. ఆదివారం ఉదయం ఇస్తామని పేర్కొన్నారు. ఫార్మాట్ మార్పు కోసం ఏకంగా బులెటిన్‌ను విడుదల చేయడాన్నే నిలిపివేశారు. ఐటీ రంగంలో విప్లవాలే సృష్టిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఫార్మాట్ మార్చడానికి బులెటిన్‌నే ఆపేయాల్సిన అవసరం ఏర్పడిందా అనే చర్చలు మొదలయ్యాయి. ఫార్మాట్ మార్పుకు సమయం పట్టడమే నిజమైతే పాత ఫార్మాట్‌లోనే శనివారం బులెటిన్ విడుదల చేయడానికి ఉన్న ఇబ్బందులేంటంటూ ప్రజారోగ్య శాఖ అధికారులను మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే సంతృప్తికరమైన సమాధానం రాలేదు.
కరోనా కట్టడిపై ప్రభుత్వానికి తగిన శ్రద్ధ లేదని హైకోర్టు మూడు రోజుల క్రితం వ్యాఖ్యలు చేసిన తర్వాతి పరిస్థితుల్లో కొత్త ఫార్మాట్ కోసం ఏకంగా బులెటిన్‌ను విడుదల చేసే ప్రక్రియే ఆగిపోయింది. ప్రతీ రోజు విడుదల చేసే బులెటిన్‌లో ఆసుపత్రుల్లో ఖాళీ బెడ్‌ల వివరాలు, వెంటిలేటర్ల వివరాలు, జిల్లాలవారీగా కేసుల సంఖ్యను ఇవ్వాలంటూ హైకోర్టు కొన్ని స్పష్టమైన సూచనలు చేసింది. ఇప్పటివరకూ వాటిని అమలుచేయని ప్రభుత్వం కొత్త ఫార్మాట్‌లోనైనా వాటిని ఇస్తుందేమో వేచి చూడాలి.