వరంగల్ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం!
దిశ, తెలంగాణ బ్యూరో : అతి త్వరలో వరంగల్హెల్త్సిటీగా మారబోతున్నది. గతంలో సీఎం కేసీఆర్‌హామీ ఇచ్చిన‘ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి’ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ శనివారం జీవో విడుదల చేశారు. రూ.1100 కోట్లతో 15 ఎకరాల్లో నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. 24 అంతస్తుల భవనంలో 2 వేల పడకలు అందుబాటులోకి రానుండగా, వీటిలో 800 పడకల్లో స్పెషాలిటీ వైద్యం అందుతుందని స్పష్టం చేశారు. 11 వందల కోట్లలో […]
దిశ, తెలంగాణ బ్యూరో : అతి త్వరలో వరంగల్హెల్త్సిటీగా మారబోతున్నది. గతంలో సీఎం కేసీఆర్‌హామీ ఇచ్చిన‘ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి’ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ శనివారం జీవో విడుదల చేశారు. రూ.1100 కోట్లతో 15 ఎకరాల్లో నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. 24 అంతస్తుల భవనంలో 2 వేల పడకలు అందుబాటులోకి రానుండగా, వీటిలో 800 పడకల్లో స్పెషాలిటీ వైద్యం అందుతుందని స్పష్టం చేశారు. 11 వందల కోట్లలో సివిల్ వర్క్స్‌కు రూ. 509 కోట్లు, మంచినీరు, పారిశుద్ధ్యం కోసం 20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం 182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం 105 కోట్లు, అనుబంధ పనుల కోసం 54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం 229.18 కోట్లను వినియోగించాలని సూచించారు. టీఎస్ఎంఎస్ఐడీసీ, డీఎంఈ ఆధ్వర్యంలో వెంటనే పనులు చేపట్టాలని రిజ్వీ ఆ జీఓలో ఆదేశించారు.
అన్నీ ఒకే చోట…
పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రభుత్వం వరంగల్‌లో మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించబోతున్నది. వీటిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ సేవలు కొరకు 1200 బెడ్లు, సూపర్ స్పెషాలిటీల కోసం మరో 800 పడకలు కేటాయించనున్నారు. ఆంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి విభాగాలన్నీ ఒకే చోట ఉంటాయి. కిడ్నీ, కాలేయం వంటి అవయవ మార్పిడికి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. కీమోథెరపీ, రేడియేషన్ సౌకర్యాలతో అత్యాధునిక క్యాన్సర్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. డెంటల్ కళాశాలను ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయనున్నారు.
హెల్త్ సిటీలో ఉండేవి ఇవే..
– వైద్య విద్య కొరకు వైద్య కళాశాల, డెంటల్ కళాశాలలు
– కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం
– 2 వేల పడకలతో మల్టీ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి
– డాక్టర్స్, వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది కొరకు క్వార్టర్స్
– రోగులకు, వారి సహాయకులకూ ప్రత్యేక వసతి
సీఎంకు కృతజ్ఞతలు : ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు
వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఈ హాస్పిటల్పూర్తయితే హైదరాబాద్ స్థాయి అద్భుత వైద్యం, వరంగల్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. దీంతో హైదరాబాద్‌లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పై భారం తగ్గుతుంది. సీఎం కేసీఆర్ అధ్వర్యంలో విద్యా, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రగామిగా నిలిచాం. మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం కేసీఆర్ ది అని మరోసారి రుజువైంది.