థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం : సీఎస్ సోమేష్ కుమార్
దిశ, తెలంగాణ : తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. మూడో దశ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్న తరుణంలో చిన్నారుల ఆరోగ్యం కోసం పకడ్భందీ చర్యలు చేపడుతున్నామన్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఆస్పత్రులను విజిట్ చేస్తున్నామని సీఎస్ చెప్పారు. థర్డ్ వేవ్‌లో చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందన్న నిపుణుల సూచనల మేరకు జిల్లాల్లో అవకాశం ఉన్న చోట్ల పిడియాట్రిక్ విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు […]
దిశ, తెలంగాణ : తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. మూడో దశ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్న తరుణంలో చిన్నారుల ఆరోగ్యం కోసం పకడ్భందీ చర్యలు చేపడుతున్నామన్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఆస్పత్రులను విజిట్ చేస్తున్నామని సీఎస్ చెప్పారు.
థర్డ్ వేవ్‌లో చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందన్న నిపుణుల సూచనల మేరకు జిల్లాల్లో అవకాశం ఉన్న చోట్ల పిడియాట్రిక్ విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ వెల్లడించారు. పిల్లలకు చికిత్స అందించేందుకు నోడల్ కేంద్రంగా నిలోఫర్ ఆస్పత్రిని ఏర్పాటు చేశామన్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతామని వివరించారు.