ఆధార్ లేకుంటే రేషన్​ కట్​!

దిశ, తెలంగాణ బ్యూరో : ఇక నుంచి రేషన్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ కార్డు తీసుకోనివారు ఆధార్‌కు సంబంధించిన అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని రేషన్ అధికారులకు అందజేయాలని పేర్కొంది. రేషన్ కార్డులున్న వారి ప్రాంతాల్లో ఆధార్ కార్డు నమోదు చేసుకునే కేంద్రాలు లేని పక్షంలో రేషన్ అధికారులు ఆధార్ సంస్థ అధికారులతో సమన్వయం చేసుకుని లబ్ధిదారులకు అందుబాటులో ఆధార్ కార్డు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని […]

Update: 2020-12-02 20:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఇక నుంచి రేషన్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ కార్డు తీసుకోనివారు ఆధార్‌కు సంబంధించిన అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని రేషన్ అధికారులకు అందజేయాలని పేర్కొంది. రేషన్ కార్డులున్న వారి ప్రాంతాల్లో ఆధార్ కార్డు నమోదు చేసుకునే కేంద్రాలు లేని పక్షంలో రేషన్ అధికారులు ఆధార్ సంస్థ అధికారులతో సమన్వయం చేసుకుని లబ్ధిదారులకు అందుబాటులో ఆధార్ కార్డు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.

రేషన్ కార్డు లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. ఐరిష్, ఫింగర్ ప్రింట్, ముఖాన్ని స్పష్టంగా గుర్తించే పరికరాలు బలహీనంగా ఉన్నప్పుడు వాటిని విడివిడిగా సేకరించి లబ్ధిదారులకు సరుకులు సరఫరా చేయాలని తెలిపింది. కళ్లు, వేళ్లు, ముఖాన్ని యంత్రాలు గుర్తించని పక్షంలో వన్ టైం పాస్ వర్డ్ లేదా పరిమిత సమయం పాస్ వర్డ్‌ను వినియోగించి రేషన్ ఇవ్వాలని పేర్కొంది. ఈ రూల్స్ ప్రభుత్వ ఉత్తర్వులు గెజిట్‌లో వెలువడిన వెంటనే అమలులోకి వస్తాయని తెలిపింది.

Tags:    

Similar News