జూడాలకు గుడ్‌న్యూస్.. ఫలించిన సమ్మె
దిశ, వెబ్‌డెస్క్: సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జూడాలకు స్టైఫండ్ పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. సీనియర్ రెసిడెంట్లకు రూ. 70 వేల నుంచి రూ. 80,500 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చి 15 రోజులవుతున్నా కనీసం స్పందన లేదని.. జూనియర్ డాక్టర్లు సమ్మె బాటపట్టిన సంగతి […]
దిశ, వెబ్‌డెస్క్: సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జూడాలకు స్టైఫండ్ పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. సీనియర్ రెసిడెంట్లకు రూ. 70 వేల నుంచి రూ. 80,500 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చి 15 రోజులవుతున్నా కనీసం స్పందన లేదని.. జూనియర్ డాక్టర్లు సమ్మె బాటపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ సేవలతో పాటు పలు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేశారు.
దీనిపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ వారి సమస్యలను పరిష్కరించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూనే.. అపత్కాలంలో ఇలా సమ్మె చేయడం సరికాదన్నారు. వెంటనే విధుల్లోకి రావాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ సమ్మె విరమించని జూనియర్ డాక్టర్లు లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే విధుల్లోకి వస్తామని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే గురువారం జూడాలకు స్టైఫండ్ పెంచుతున్నట్టు గవర్నమెంట్ నుంచి ఉత్వర్వులు రావడం విశేషం.