తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అపశృతి.. ఒకరు మృతి
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామం అంగన్ వాడీ కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లలో విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతిచెందాడు. జెండా ఏర్పాటు కోసం ఇనుప పైపు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో విద్యుత్ వైర్లకు పైపు తగిలి అంగన్ వాడీ టీచర్ భర్త అశోక్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంగన్ వాడి ఆయా కళవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కళవ్వను చికిత్స నిమిత్తం ఆస్పత్రి కి తరలించారు. […]
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామం అంగన్ వాడీ కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లలో విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతిచెందాడు. జెండా ఏర్పాటు కోసం ఇనుప పైపు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో విద్యుత్ వైర్లకు పైపు తగిలి అంగన్ వాడీ టీచర్ భర్త అశోక్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంగన్ వాడి ఆయా కళవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కళవ్వను చికిత్స నిమిత్తం ఆస్పత్రి కి తరలించారు.
స్పందించిన మంత్రి హరీష్ రావు:
దొమ్మట ఘటనపై మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అశోక్ కుటుంబాన్ని అన్ని విధాలా అదుకుంటామన్నారు. ప్రభుత్వ పరంగా రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అంగన్ వాడీ ఆయా కళవ్వకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించామన్నారు. మెరుగైన చికిత్స అందించాలఅని ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్యులను ఆదేశించారు.