ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల ఫలితాలు రేపు(మంగళవారం) ప్రభుత్వం విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఎంసెట్ ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అంతేగాకుండా రాష్ట్రంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ కూడా సోమవారం ఖరారైంది. ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ నెల 12 నుంచి 18 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించనున్నారు. ఈ […]

Update: 2020-10-05 07:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల ఫలితాలు రేపు(మంగళవారం) ప్రభుత్వం విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఎంసెట్ ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అంతేగాకుండా రాష్ట్రంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ కూడా సోమవారం ఖరారైంది. ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదుకు అధికారులు అవకాశం ఇచ్చారు.

ఈ నెల 12 నుంచి 18 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించనున్నారు. ఈ నెల 12 నుంచి 20 వరకు ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. 22న మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు. 29 నుంచి ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగనుంది. 30న తుది విడత ధ్రువపత్రాల పరిశీలిస్తారు. 30,31 తేదీల్లో తుది విడుత ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. నవంబర్‌ 2న ఇంజినీరింగ్‌ తుది విడుత సీట్ల కేటాయించనున్నారు. 4న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News