పీఆర్సీ కోసం నిరసనలు: టీఈఏ

దిశ, తెలంగాణ బ్యూరో : పీఆర్సీ సాధన కోసం తెలంగాణ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ నిరసనలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 21న మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు పిలుపునిచ్చింది. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్​ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అసోసియేషన్​ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఈఏ అధ్యక్షుడు చిలగాని సంపత్​ కుమారస్వామి మాట్లాడుతూ.. పీఆర్సీతో పాటు బకాయిలున్న రెండు డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పీఆర్సీ కమిషన్​ గడువు కూడా ఈ […]

Update: 2020-12-16 06:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పీఆర్సీ సాధన కోసం తెలంగాణ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ నిరసనలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 21న మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు పిలుపునిచ్చింది. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్​ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అసోసియేషన్​ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఈఏ అధ్యక్షుడు చిలగాని సంపత్​ కుమారస్వామి మాట్లాడుతూ.. పీఆర్సీతో పాటు బకాయిలున్న రెండు డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం పీఆర్సీ కమిషన్​ గడువు కూడా ఈ నెలాఖరుతో తీరుతుందని, ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని విమర్శించారు. ఇప్పటికైనా పీఆర్సీ ప్రకటించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. ఉద్యోగవర్గాలు పీఆర్సీ, డీఏ, ఐఆర్​ కోసం ఎదురుచూస్తున్నారని, హుజూర్​నగర్​ ఉప ఎన్నికల తర్వాత పీఆర్సీ ప్రకటన వస్తుందని ఆశించామన్నారు. గతంలో సీఎం కేసీఆర్​ కూడా ప్రకటించారని, ఇప్పటికైనా పీఆర్సీపై నిర్ణయం తీసుకోవాలని సంపత్​ కుమారస్వామి కోరారు.

టీఈఏ ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం

అలాగే, తెలంగాణ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్​ పొట్టబత్తిని పురుషోత్తం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సంపత్​ కుమారస్వామి ప్రకటించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. డాక్టర్​ పురుషోత్తం విద్యార్థి దశ నుంచి డాక్టర్స్​ అసోసియేషన్​లో ప్రైవేట్​ వైద్య కాలేజీల్లో సదుపాయాల కోసం ఉద్యమించారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్​ ఛార్జీల రద్దు కోసం కృషి చేశారని అభినందించారు. అనంతరం టీఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఎంప్లాయిస్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో పని చేస్తామన్నారు. ఈ నెల 21న ఇచ్చిన నిరసనలను విజయవంతం చేయాలని పురుషొత్తం పిలుపునిచ్చారు.

Tags:    

Similar News