క్లస్టర్ ఏరియాల్లో తగు జాగ్రత్తలు చేపట్టండి : సీఎస్ సోమేష్ కుమార్
దిశ, నిజామాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి కంటామినెంట్ క్లస్టర్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ అన్నారు. ఇది చాలా క్లిష్టమైన సమస్య కావున ఆ ప్రాంతాల్లో తగు జాగ్రత్తలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్లను కోరారు. నిజామాబాద్ జిల్లాలో హైదరాబాద్ తర్వాత అధికంగా కేసులు నమోదవుతున్నందున తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు నారాయణ రెడ్డికి ప్రత్యేకంగా సూచించారు. ఇంతవరకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై […]
దిశ, నిజామాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి కంటామినెంట్ క్లస్టర్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ అన్నారు. ఇది చాలా క్లిష్టమైన సమస్య కావున ఆ ప్రాంతాల్లో తగు జాగ్రత్తలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్లను కోరారు. నిజామాబాద్ జిల్లాలో హైదరాబాద్ తర్వాత అధికంగా కేసులు నమోదవుతున్నందున తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు నారాయణ రెడ్డికి ప్రత్యేకంగా సూచించారు. ఇంతవరకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
గురువారం హైదరాబాద్ నుంచి సంబంధిత శాఖల సీనియర్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో కరోనా వైరస్ తదనంతరం తీసుకునే చర్యలైన ధాన్యం కొనుగోలు, వలస కూలీలకు బియ్యం పంపిణీ తదితర విషయాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. కంటామినెంట్ ప్రాంతాల్లో అవసరమైన సిబ్బంది, సదుపాయాలు కల్పించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ రైతులు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 21 నుంచి 28వరకు హోం క్వారంటైన్‌లో ఉన్నవారిని విడుదల చేసే ముందు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల నివారణకు కలెక్టర్ నారాయణరెడ్డి తీసుకున్న చర్యలను సీఎస్‌కు వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో 45 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. బాధితుల నివాస ప్రాంతాలు అనగా 20 లొకేషన్లలో కంటామినెంట్ క్లస్టర్‌లను ఏర్పాటు చేయుటకు ప్రణాళిక సిద్దం చేశామన్నారు. దానితో పాటే అక్కడి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, నిత్యావసరాలు పంపిణీకి సివిల్ అధికారులను నియమించామన్నారు. క్లస్టర్ కార్యాలయాల కోసం కంట్రోల్ రూమ్‌లనుప్రారంభిస్తామన్నారు. క్లస్టర్ ప్రాంతాల్లో 28,800ల కుటుంబాలు ఉన్నాయని ప్రతి కుటుంబానికి 1 టీమ్‌ను ఏర్పాటు చేసి, ఒక ఆశా వర్కర్‌ను నియమిస్తామన్నారు. ప్రతిరోజు వారి ఆరోగ్య వివరాలు సేకరించాలని ఆదేశించామన్నారు. నేటికి 28వేల కుటుంబాలకు సర్వే పూర్తయిందన్నారు. ఈ ప్రాంతాల్లో బ్యారికేడ్లు వేయించి రోడ్లు మూసి వేశామన్నారు.
మర్కజ్ వెళ్లి వచ్చిన 63 మందిలో 32మందికి పాజిటివ్ వచ్చిందని, మిగతా 2రిపోర్ట్స్ రావాల్సి ఉందన్నారు. మిగతా వారికి నెగెటివ్ వచ్చాయన్నారు.పాజిటివ్ వచ్చిన 47 మంది ప్రైమరీ కాంటాక్ట్స్ 285 మందికి గాను, 218 మందికి శాంపిల్స్ తీసుకున్నామని, మిగతా వారిని ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచి ఒక్కొక్కరికీ వేర్వేరుగా గదులు కేటాయించామన్నారు. అధికారులు అనుమతి ఇవ్వగానే వారి శాంపిల్స్ కూడా హైదరాబాద్‌కు పంపిస్తామన్నారు.జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి చెందిన సీఎస్ విపత్కర పరిస్థితుల్లో క్రియాశీలకంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్కు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌లు లత, చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో ప్రతి మరాజ్, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు.
Tags: lockdown, claster area, cs somesh kumar, dist collecter carona review meet, take strict actions, orders to collecters