కొత్తగా 9 మందికి కరోనా.. 68కి చేరిన కేసులు

దిశ, న్యూస్ బ్యూరో: మరో తొమ్మిది మందికి శనివారం కరోనా పాజిటివ్ అని తేలడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 68కి చేరుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో పాజిటివ్ పేషెంట్ల వివరాలను వెల్లడించే సమయానికి మొత్తం కేసుల సంఖ్య 59గా ఉంది. శుక్రవారం ఒక్క రోజే 14 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, శనివారం మరో తొమ్మిది మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. కొత్తగా పాజిటివ్ రిపోర్టు వచ్చిన పేషెంట్ల వయసు, నగరంలోని ఏ […]

Update: 2020-03-28 05:43 GMT

దిశ, న్యూస్ బ్యూరో: మరో తొమ్మిది మందికి శనివారం కరోనా పాజిటివ్ అని తేలడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 68కి చేరుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో పాజిటివ్ పేషెంట్ల వివరాలను వెల్లడించే సమయానికి మొత్తం కేసుల సంఖ్య 59గా ఉంది. శుక్రవారం ఒక్క రోజే 14 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, శనివారం మరో తొమ్మిది మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. కొత్తగా పాజిటివ్ రిపోర్టు వచ్చిన పేషెంట్ల వయసు, నగరంలోని ఏ ప్రాంతానికి చెందినవారు, వారి ట్రావెల్ హిస్టరీ ఏమిటి తదితర అంశాలన్నీ వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు.

మరోవైపు నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చనిపోయిన పేషెంట్‌కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు మాత్రం ధ్రువీకరించలేదు. పేషెంట్ చనిపోవడానికి కారణాలు వేరే అయినప్పటికీ రిపోర్టులో మాత్రం కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

Tags : Telangana, Corona, Positive Patients, increase

Tags:    

Similar News