రేవంత్ రెడ్డి భారీ ప్లాన్.. ధరణి సమస్యలపై కీలక నిర్ణయం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ధరణి సమస్యలపై కాంగ్రెస్​పార్టీ పోరాటానికి సిద్ధమవుతోంది. భూ సమస్యలు తీర్చేందుకు కేసీఆర్​సర్కారు ప్రవేశపెట్టిన ధరణితో మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ఇప్పటికే ఆరోపణలున్నాయి. ప్రధానంగా అసైన్డ్ భూములు, వక్ఫ్​భూముల వంటి అంశాలు తీరని సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలో ధరణి, భూ సంస్కరణల అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కమిటీకి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర […]

Update: 2021-11-20 06:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ధరణి సమస్యలపై కాంగ్రెస్​పార్టీ పోరాటానికి సిద్ధమవుతోంది. భూ సమస్యలు తీర్చేందుకు కేసీఆర్​సర్కారు ప్రవేశపెట్టిన ధరణితో మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ఇప్పటికే ఆరోపణలున్నాయి. ప్రధానంగా అసైన్డ్ భూములు, వక్ఫ్​భూముల వంటి అంశాలు తీరని సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలో ధరణి, భూ సంస్కరణల అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కమిటీకి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు.

అలాగే కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి కన్వీనర్‌గా ఉండగా.. సభ్యులుగా ఈరవర్తి అనిల్, బెల్లయ్య నాయక్, కొండపల్లి దయాసాగర్, ప్రత్యేక ఆహ్వానితులుగా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్‌లను నియమిస్తూ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ధరణి, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, భూ సేకరణ అంశాలపై అధ్యయనం చేసి 45 రోజులలో టీపీసీసీకి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కమిటీ నివేదిక తర్వాత కాంగ్రెస్​పార్టీ ధరణి సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

Tags:    

Similar News