ఈటల భూ కబ్జాపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా విషయంపై సమగ్ర విచారణ జరిపించి నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్‌కు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు వెళ్లాయి. మెదక్ జిల్లాలోని మాసాయి పేటలో గల అసైన్డ్ ల్యాండ్‌ను అక్రమంగా కబ్జా చేయడంతో పాటు రైతులను బెదిరించారని మంత్రి ఈటలపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో జిల్లా కలెక్టర్‌తో సమగ్ర […]

Update: 2021-04-30 08:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా విషయంపై సమగ్ర విచారణ జరిపించి నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్‌కు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు వెళ్లాయి.

మెదక్ జిల్లాలోని మాసాయి పేటలో గల అసైన్డ్ ల్యాండ్‌ను అక్రమంగా కబ్జా చేయడంతో పాటు రైతులను బెదిరించారని మంత్రి ఈటలపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో జిల్లా కలెక్టర్‌తో సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్‌తో పాటు విజిలెన్స్ డీజీకి కూడా ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.

బిగ్ న్యూస్ : మంత్రి ఈటల ఉద్వాసనకు రంగం సిద్ధం?

Full View

Tags:    

Similar News