కేబినెట్ భేటీ ప్రారంభం.. లాక్‌డౌన్‌పై చర్చ!
దిశ, వెబ్‌డెస్క్ : ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలను మరింత సడలించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కరోనా కేసులు తగ్గుతున్న కారణంగా లాక్‌డౌన్ కాకుండా కేవలం రాత్రి సమయంలో కర్ఫ్యూ మాత్రమే విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కేబినెట్ భేటీలో ఖరీఫ్ సాగు, గోదావరి నీటి ఎత్తిపోతలపై, ఏపీ ప్రాజెక్టుల నిర్మాణంపై, […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలను మరింత సడలించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
కరోనా కేసులు తగ్గుతున్న కారణంగా లాక్‌డౌన్ కాకుండా కేవలం రాత్రి సమయంలో కర్ఫ్యూ మాత్రమే విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కేబినెట్ భేటీలో ఖరీఫ్ సాగు, గోదావరి నీటి ఎత్తిపోతలపై, ఏపీ ప్రాజెక్టుల నిర్మాణంపై, విద్యార్ధుల ఆన్‌లైన్ తరగతులపై ఈ భేటీలో చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన, ఆకస్మిక తనిఖీలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.