అమ్మా బైలెల్లాలంటే.. కరోనా కరుణించాలె!
తెలంగాణలో ఎంతో వైభవంగా నిర్వహించే బోనాల పండుగనూ కరోనా వైరస్ కళ తప్పేలా చేస్తుంది. రాష్ర్టప్రభుత్వం విధించిన నిబంధనలు బోనాల పండుగకూ ఉంటాయని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే బోనాల పండుగకు సంబంధించి, ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేస్తుందని అన్నారు. దేవాలయాల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని, దర్శనంలోనూ భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. రాష్ర్టంలోని అన్ని ఆలయాల్లో శానిటైజర్లు, మాస్కులు ఉపయోగించేలా […]
తెలంగాణలో ఎంతో వైభవంగా నిర్వహించే బోనాల పండుగనూ కరోనా వైరస్ కళ తప్పేలా చేస్తుంది. రాష్ర్టప్రభుత్వం విధించిన నిబంధనలు బోనాల పండుగకూ ఉంటాయని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే బోనాల పండుగకు సంబంధించి, ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేస్తుందని అన్నారు. దేవాలయాల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని, దర్శనంలోనూ భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. రాష్ర్టంలోని అన్ని ఆలయాల్లో శానిటైజర్లు, మాస్కులు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా ప్రస్తుతం రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో ఆలయాల్లో తీర్థం, ప్రసాదాలు ఉండవని తెలిపారు.