తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉంది : బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శలు చేశారు. ఈటల భూ ఆక్రమాలను వెలికి తీస్తు్న్న ప్రభుత్వం అమీన్‌పూర్ భూముల స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. మంత్రి మల్లారెడ్డి మీద వచ్చిన భూ కబ్జా ఆరోపణలు వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మంత్రుల్లో సగం మందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, మరి వారిపై ఎందుకు విచారణ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా.. […]
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శలు చేశారు. ఈటల భూ ఆక్రమాలను వెలికి తీస్తు్న్న ప్రభుత్వం అమీన్‌పూర్ భూముల స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. మంత్రి మల్లారెడ్డి మీద వచ్చిన భూ కబ్జా ఆరోపణలు వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మంత్రుల్లో సగం మందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, మరి వారిపై ఎందుకు విచారణ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా.. ఈటల రాజేందర్ చేసిన అవినీతి ఇన్నిరోజులు ఎందుకు వెలికి తీయలేదని మండిపడ్డారు. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేల కబ్జాలను తామే బయటపెట్టామని గుర్తుచేశారు. అంతేగాకుండా.. పలువురు ఎమ్మెల్యేలపై డ్రగ్స్ కేసు నివేదిక ఏమైందని, 111 జీవో ఉల్లంఘన ఆరోపణలపై చర్యలేవి? అని ప్రశ్నించారు. కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చిన నిధుల్ని పక్కదారి పట్టించారని విమర్శించారు. తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉందని, కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని తెలిపారు.