విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

దిశ, చార్మినార్​ : విజయవాడ ఇంద్రకీలాద్రి పై తెలంగాణ బోనాల జాతర ఘట్టం ప్రతిభింబించింది. ఆంధ్రప్రదేశ్​లో తెలంగాణ బోనాల జాతర కొత్త శోభను సంతరించుకుంది. ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. సప్తమాత్రులకు సప్త బంగారుబోనం సమర్పణలో భాగంగా భాగ్యనగర్​శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు బత్తుల బల్వంత్​యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. ఆంధ్రప్రదేశ్​రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ముఖ్య అతిధిగా […]

Update: 2021-07-18 05:09 GMT

దిశ, చార్మినార్​ : విజయవాడ ఇంద్రకీలాద్రి పై తెలంగాణ బోనాల జాతర ఘట్టం ప్రతిభింబించింది. ఆంధ్రప్రదేశ్​లో తెలంగాణ బోనాల జాతర కొత్త శోభను సంతరించుకుంది. ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. సప్తమాత్రులకు సప్త బంగారుబోనం సమర్పణలో భాగంగా భాగ్యనగర్​శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు బత్తుల బల్వంత్​యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. ఆంధ్రప్రదేశ్​రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శనివారం విజయవాడకు బయలుదేరారు.

బ్యాండు మేళాలు… పోతరాజుల నృత్యాలు…శివసత్తుల నడుమ నిషాక్రాంతి బంగారుబోనంతో విజయవాడ పురవీధులలో గుండా ఇంద్రకీలాద్రిపై న ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపుగా ముందుకు సాగారు. అక్కడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యాన్ని సమర్పించారు. గత 12 సంవత్సరాలుగా ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ అమ్మవారికి భక్తి శ్రద్దలతో బంగారుబోనాన్ని సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం చైర్మన్​పైలాసోమినాయుడు, ఇఓ బ్రమరాంభ, బోర్డు మెంబర్లు బండారి జ్యోతి, నాగలక్ష్మి, శ్రీనివాస్, స్వరూప ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఊరేగింపు కమిటీ ఉపాధ్యక్షుడు బి.బల్వంత్​ యాదవ్​, మాజీ చైర్మన్​లు గాజుల అంజయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు మధుసూధన్​గౌడ్​, మధుసూధన్​ యాదవ్​, ఆనంద్​కుమార్​, వేణుగోపాల్​, గాజుల రాహుల్​, పి.వెంకటేష్​, సి.రాజ్​కుమార్​, షీరా రాజ్​కుమార్​, కె.వెంకటేష్​, మారుతీయాదవ్​, జి.అరవింద్​కుమార్​ గౌడ్, పొన్న వెంకట రమణ, సుమన్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఐదేళ్ల బాలుడి ప్రదర్శన

విజయవాడ పురవీధుల గుండా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లికి బంగారు బోనం ప్రదర్శనలో భాగంగా ఐదేళ్ల కుర్రాడి మల్లన్న నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. ఉప్పల్​కు చెందిన ఐదేళ్ల లవన్​కుమార్ ప్రదర్శించిన మల్లన్న నృత్యం ఊరేగింపుకు హైలైట్​గా నిలిచింది.

Tags:    

Similar News