దిశ ఎఫెక్ట్: తక్షణమే చర్యలు తీసుకుంటాం

దిశ, కొత్తగూడ: తెలంగాణ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీగా వరదలు చేరి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కార్లాయి పాత చెరువుకి ఆదివారం గండి పడింది. దీంతో ‘‘కార్లాయి కట్ట తెగింది’’ అనే శీర్షికతో ‘దిశ’ పత్రికలో వచ్చిన వార్తకు స్థానిక తహసీల్దార్ నరేష్ స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం తన సిబ్బందితో కలిసి సదరు చెరువును సందర్శించారు. అనంతరం స్థానిక రైతులను కలిసి వివరాలు […]

Update: 2021-09-06 05:43 GMT

దిశ, కొత్తగూడ: తెలంగాణ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీగా వరదలు చేరి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కార్లాయి పాత చెరువుకి ఆదివారం గండి పడింది. దీంతో ‘‘కార్లాయి కట్ట తెగింది’’ అనే శీర్షికతో ‘దిశ’ పత్రికలో వచ్చిన వార్తకు స్థానిక తహసీల్దార్ నరేష్ స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం తన సిబ్బందితో కలిసి సదరు చెరువును సందర్శించారు. అనంతరం స్థానిక రైతులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. గతంలో చెరువు మరమ్మతు కోసం ఖర్చు అంచనా వేసి పంపించామని, కానీ, నేటికీ నిధులు మంజూరు కాలేదన్నారు. తాజాగా.. పంటసాగును దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుతం చెరువునీరు వృథా కాకుండా తక్షణమే చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. తప్పకుండా.. తొందర్లోనే శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ అనూష, ఆర్‌ఐ విజేందర్, ఎంపీటీసీ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News