త్వరలో Paytm సేవలు నిలిచిపోనున్నాయా ?
నెట్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి చాలామంది ఏ వస్తువును తీసుకున్నా, ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా లిక్విడ్ మని కాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే చేస్తున్నారు.
దిశ, ఫీచర్స్ : నెట్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి చాలామంది ఏ వస్తువును తీసుకున్నా, ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా లిక్విడ్ మని కాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే చేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్ పే, పేటీఎం లాంటి యాప్స్ ని మనీ ట్రాన్సాక్షన్ కోసం వినియోగిస్తున్నారు. అయితే Paytm పై RBI తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రజల మదిలో ప్రశ్నలు తలెత్తడం మొదలయ్యాయి. ఫిబ్రవరి 29 తర్వాత Paytm మునుపటిలా పని చేస్తుందా లేదా Paytm సేవలు పూర్తిగా నిలిచిపోతాయా ? అలాగే, RBI తీసుకున్న చర్యల కారణంగా, ఫిబ్రవరి 29 తర్వాత తమ Paytm బ్యాంక్ ఖాతాలో డబ్బు మిగిలి ఉంటే, వారు దానిని ఎప్పటికీ విత్‌డ్రా చేయలేరా అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మీకు కూడా ఇలాంటి సందేహాలు వస్తున్నాయా. అయితే ఈ సమాధానాలు మీ కోసమే.
ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం..
RBI Paytm బ్యాంక్ పై మాత్రమే చర్య తీసుకుంది. దీంతో మీరు ఫిబ్రవరి 29 తర్వాత మీ Paytm బ్యాంక్ ఖాతా నుండి Fastag, Metro కార్డ్ లేదా మరేదైనా ఇతన లావాదేవీలు చెల్లించలేరు. అలాగే, ఫిబ్రవరి 29 తర్వాత, మీరు Paytm బ్యాంక్ ఖాతా ద్వారా చెల్లింపులను స్వీకరించలేరు.
ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఖాతాలో జమ అయిన డబ్బు ఏమవుతుంది ?
Paytm వినియోగదారులు ఫిబ్రవరి 29 తర్వాత తమ Paytm బ్యాంక్ ఖాతాలో డబ్బు మిగిలి ఉంటే, వారు దానిని ఎప్పటికీ తీసుకోలేరని భయపడుతున్నారు. కానీ మీరు Paytm బ్యాంక్ ఖాతాలో డబ్బు మిగిలి ఉంటే, మీరు దానిని ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు?
Paytm UPI పని చేస్తూనే ఉంటుందా?
ఫిబ్రవరి 29 తర్వాత Paytm UPI పై ఎలాంటి ప్రభావం ఉండదు. మీరు మీ Paytm UPIని బ్యాంక్‌తో విలీనం చేసినట్లయితే, మీరు దాని ద్వారా చెల్లింపు చేయవచ్చు.
RBI చర్య వల్ల Paytm ఎంత నష్టపోతుంది ?
Paytm బ్యాంక్ పై RBI చర్య కారణంగా, Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ ఏటా దాదాపు 300 నుంచి 500 కోట్ల రూపాయల లాభనష్టాలను చవిచూస్తుంది. అదే సమయంలో, ఫిబ్రవరి 29 తర్వాత, Paytm మునుపటిలాగా మిగిలిన అన్ని సేవలను కొనసాగిస్తుందని Paytm CEO విజయ్ శేఖర్ శర్మ స్పష్టం చేశారు.