WhatsApp యూజర్లకు గుడ్‌న్యూస్.. స్టేటస్‌గా నిమిషం వీడియో!
మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన ఆప్షన్లను అందించడానికి ఇప్పటికే కొత్త కొత్త ఫీచర్లను తీసుకురాగా, త్వరలో కంపెనీ మరో సదుపాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది
దిశ, టెక్నాలజీ: మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన ఆప్షన్లను అందించడానికి ఇప్పటికే కొత్త కొత్త ఫీచర్లను తీసుకురాగా, త్వరలో కంపెనీ మరో సదుపాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. యూజర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్టేటస్ అప్‌డేట్ టైంను పెంచనుంది. ప్రస్తుతం 30 సెకన్లు నిడివి కలిగిన వీడియోలను మాత్రమే స్టేటస్‌గా పెట్టుకోడానికి అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ నిడివి ఉన్నట్లయితే మరో అప్‌డేట్‌గా పెట్టుకోవాలి. అయితే ఈ టైంను పెంచాలని చాలా మంది యూజర్లు గత కొంత కాలంగా కంపెనీని అభ్యర్థిస్తుండగా, తాజాగా ఈ విషయంలో వాట్సాప్ శుభవార్త చెప్పడానికి సిద్ధమైంది. ఇకమీదట 60 సెకన్లు కలిగిన విడియోలను స్టేటస్‌లుగా పెట్టుకోడానికి కొత్త ఫీచర్‌ను త్వరలో విడుదల చేయబోతుందని సమాచారం. ప్రస్తుతం బీటా వెర్షన్ 2.24.7.3 ను డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లకు అందుబాటులోకి రాగా, త్వరలో మిగతా వారికి విడుదల అవుతుందని కంపెనీ పేర్కొంది.