వాట్సాప్‌లో వాయిస్ నోట్‌లను టెక్ట్స్‌గా మార్చే కొత్త ఫీచర్

ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ నుంచి మరో ఫీచర్ రాబోతుంది. వాయిస్ నోట్‌లను టెక్ట్స్‌ రూపంలోకి మార్చే కొత్త సదుపాయాన్ని త్వరలో విడుదల చేయబోతుంది

Update: 2024-03-21 11:39 GMT

దిశ, టెక్నాలజీ: ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ నుంచి మరో ఫీచర్ రాబోతుంది. వాయిస్ నోట్‌లను టెక్ట్స్‌ రూపంలోకి మార్చే కొత్త సదుపాయాన్ని త్వరలో విడుదల చేయబోతుంది. స్మార్ట్‌ఫోన్‌లోని స్పీచ్ రికగ్నిషన్ ఫీచర్‌ని ఉపయోగించి వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్‌గా మార్చనున్నారు. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్‌లను వినడం వీలు కానీ సమయాల్లో టెక్ట్స్ రూపంలో మ్యాటర్ చదువుకోవచ్చు. వినికిడి లోపం ఉన్న వినియోగదారులకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

స్మార్ట్‌ఫోన్‌లో వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్ట్‌లను ఎనేబుల్ చేయడానికి 150MB కొత్త యాప్ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనిలో వాయిస్‌నోట్‌లు, టెక్స్ట్‌లు అన్ని ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను చేయబడి ఉంటాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.ఫీచర్ ట్రాకర్ WABetaInfo ప్రకారం, దీనిని ఆండ్రాయిడ్ 2.24.7.8 బీటా యూజర్ డివైజ్‌లలో వాడుతున్నారు. ఇప్పటికే ఈ ఫీచర్ iOS వాట్సాప్ బీటా వెర్షన్ 23.9.0.70లో అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారులు కూడా పొందనున్నారు.


Similar News