WhatsApp లో మరో కొత్త ఫీచర్!
మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఇటీవల కాలంలో వరుసగా కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఇటీవల కాలంలో వరుసగా కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చాలా రకాల ఫీచర్లను తెచ్చిన కంపెనీ తాజాగా ‘సీక్రెట్ కోడ్’ అనే ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా యూజర్లు లాక్ చేసినటువంటి చాట్‌లపై మరింత నియంత్రణ కలిగి ఉంటారు. లాక్ చేసినటువంటి చాట్ ఫోల్డర్లకు అనుకూలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవచ్చు. ఈ సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఏఏ చాట్‌లను లాక్ చేశారో వాటిని సెర్చ్ బార్‌లో కనుగొనవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ చేస్తున్నారు. అన్ని పూర్తయ్యాక త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది.
Android బీటా v2.23.21.9 కోసం WhatsAppలో ఈ ఫీచర్ మొదటగా గుర్తించారు. ఇంతకుముందు వాట్సాప్ చాట్ లాక్ అనే ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. పాస్‌కోడ్, వేలిముద్ర, ఫేస్ అన్‌లాక్ వంటి ఆప్షన్లను ఉపయోగించి చాట్‌ను లాక్ చేసుకోవచ్చు. అవతలి వారు చాట్‌ను చూడకుండా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ‘సీక్రెట్ కోడ్’ అనే ఫీచర్‌ను కూడా దీనికి అనుబంధంగా తెస్తున్నారు.