WhatsApp మరో సెక్యూరిటీ ఫీచర్.. ఇక ఆ వివరాల ట్రాకింగ్ కుదరదు!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇంతకుముందు గుర్తు తెలియని వారి నుంచి వచ్చే కాల్స్‌ను రింగ్ కాకుండా సైలెంట్ మోడ్‌లో పెట్టే ఆప్షన్‌ను తీసుకొచ్చిన కంపెనీ, తాజాగా యూజర్లకు మరింత భద్రత అందించడానికి IP అడ్రస్, లొకేషన్ వివరాలను అవతలి వారు ట్రాక్ చేయకుండా ఉండే ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో యూజర్లు ఆడియో కాల్స్ లేదా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి మీ IP అడ్రస్, లొకేషన్‌ను తెలుసుకోలేరు.
ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే వాట్సాప్‌లో ప్రైవసీ ఆప్షన్‌లో ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్‌ను ఆన్ చేయాలి. అయితే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని కాల్స్ మాట్లాడితే కాల్ నాణ్యత కొంతమేర తగ్గే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం ఎంపిక చేసిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందించారు. త్వరలో మిగతా వారికి అందుబాటులోకి రానుంది.