WhatsApp లో మరో కొత్త ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. గ్రూప్ కాల్స్‌ను మరింత మెరుగ్గా మార్చడానికి కంపెనీ వాయిస్ చాట్‌లను ప్రారంభించింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. గ్రూప్ కాల్స్‌ను మరింత మెరుగ్గా మార్చడానికి కంపెనీ వాయిస్ చాట్‌లను ప్రారంభించింది. సాధారణంగా వాట్సాప్ గ్రూప్ కాల్ వస్తే దానిలో ఉన్న మెంబర్స్ అందరికి నోటిఫికేషన్‌తో పాటు రింగ్ టోన్ వస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు చాలా డిస్టబెన్స్‌గా ఉంటుంది. అయితే ఇక ఆ సమస్య లేకుండా కంపెనీ వాయిస్ చాట్ ఫీచర్‌ను తెచ్చింది.
దీంతో ఇక మీదట గ్రూప్ కాల్ వస్తే ఎలాంటి రింగ్ రాదు. గ్రూప్‌లో ఉన్నటువంటి వారికి కేవలం సైలెంట్ నోటిఫికేషన్ మాత్రమే వస్తుంది. ఇది స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ వాయిస్ చాట్‌లో పాల్గొనాలనుకునే వారు అది ముగిసేలోపు ఎప్పుడైన జాయిన్ కావచ్చు. వాయిస్ చాట్ కాల్ 60 నిమిషాల వరకు మాత్రమే మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఆ తరువాత కాల్ ఆటోమెటిక్‌గా కట్ అవుతుంది. ఈ ఫీచర్ కోసం గ్రూప్ చాట్‌లో స్క్రీన్ కుడి వైపున కొత్త వేవ్‌ఫార్మ్ పై క్లిక్ చేసి వాయిస్ చాట్‌ను మొదలుపెట్టవచ్చు. ప్రస్తుతం ఇది 33 కంటే ఎక్కువ మెంబర్స్ ఉన్న గ్రూపులకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగతా వారికి కూడా వస్తుంది.