WhatsApp నుంచి మరో కీలక అప్‌డేట్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వరుసగా కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వరుసగా కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. తన యూజర్లకు సులభమైన పద్ధతుల్లో సేవలు అందించడానికి ఇప్పటికే కొన్నింటిని తీసుకురాగా, తాజాగా మరోక ఫీచర్‌ను అందించాలని చూస్తుంది. వాట్సాప్ విండోస్‌లో వినియోగదారులు పెద్ద ఫార్మాట్‌లో స్టిక్కర్‌లను పంపడానికి అనుమతించే కొత్త ఆప్షన్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది.
WABetaInfo నివేదిక ప్రకారం, ఎమోజీలు సాధారణంగా చిన్నగా ఉంటాయి, దీంతో ఇవి బలమైన విజువల్ ఎఫెక్ట్‌ను అందించడం లేదు. వీటి సైజు చిన్నగా ఉండటం కారణంగా యూజర్లు తక్కువగా ఎమోజీలను వాడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన వాట్సాప్ ఎమోజీలను డిఫాల్ట్‌గా పెద్ద ఫార్మాట్‌లో ఇవ్వాలని చూస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
పెద్ద స్టిక్కర్‌లతో, వినియోగదారులు చాట్‌లో ఉన్నవారి దృష్టిని మరింత సమర్థవంతంగా ఆకర్షించగలరని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో విండోస్ అప్‌డేట్‌లో బీటా టెస్టర్లకు విడుదల చేయడం ప్రారంభించింది. త్వరలో మిగతా వారికి అందుబాటులోకి రానుంది.
Read More..