ఇండియాలో లక్షల ఖాతాలను నిషేధించిన వాట్సాప్.. మొత్తం ఎన్నంటే..

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఇండియాలో సెప్టెంబర్‌లో 71.1 లక్షల ఖాతాలను నిషేధించినట్ట ఒక ప్రకటనలో పేర్కొంది.

Update: 2023-11-02 14:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఇండియాలో సెప్టెంబర్‌లో 71.1 లక్షల ఖాతాలను నిషేధించినట్ట ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిలో ముందుగా 25.7 లక్షల ఖాతాలను వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండానే నిషేధించింది. వాట్సాప్‌లో అనవసరమైన కంటెంట్‌ను ఫార్వర్డ్ చేయడం, స్పామ్ ఖాతాలు మొదలగు వాటిని సెప్టెంబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2023 మధ్య ఈ స్థాయిలో నిషేధించినట్లు అధికారులు పేర్కొన్నారు.

భారత ఐటీ నిబంధనలకు అనుగుణంగా వాట్సాప్ ప్రతినెలా ఖాతాల పట్ల తీసుకున్న చర్యల వివరాలను విడుదల చేస్తుంది. సెప్టెంబర్ నెలలో యూజర్ల నుంచి 10,442 ఫిర్యాదులు వచ్చాయి. స్పామ్ ఖాతాల నిషేధానికి కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థను కంపెనీ వాడుతుంది. ఇంతకుముందు ఆగస్టు నెలలో వాట్సాప్ 74 లక్షల ఖాతాలను నిషేధించింది. తమ ప్లాట్‌ఫారమ్‌లో దుర్వినియోగం లేదా హానికరమైన కంటెంట్‌కు సంబంధించిన సమస్యల పట్ల త్వరగా చర్యలు తీసుకుంటామని యూజర్లకు ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ సేవలు అందిస్తామని కంపెనీ పేర్కొంది.

Tags:    

Similar News